పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు ఓ శుభవార్త.ఫొటో మరియు వీడియో షేరింగ్ యాప్ అయినటువంటి ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారనేది తెలుసుకునేందుకు వీలుగా తల్లిదండ్రుల కోసం పేరెంటల్ సూపర్ విజన్ ఫీచర్‌ను ఇన్‌స్టా కంపెనీ తీసుకొచ్చింది.బేసిగ్గా ఈ మధ్య కాలంలో గాని చూసుకుంటే ఇంస్టాగ్రామ్ ని కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు అని లెక్కలు చెబుతున్నాయి.
ఇంస్టాగ్రామ్ ద్వారా మనం ఇతరుల పోస్టు చూడొచ్చు.అలానే మనం కూడా ఏదైనా పోస్ట్ చేయొచ్చు.
ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ ‘పేరెంటల్ సూపర్‌విజన్ ఫీచర్‘ కావాలనుకునే వారు ముందుగా తమ పిల్లల ఖాతాల నుంచి ఫీచర్ యాక్టివ్ చేయాలని ఇన్‌స్టాగ్రామ్ కస్టమర్ కేర్ ని సంప్రదించాలి.తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలు ఉపయోగించే ఖాతాలకు పేరెంటల్ సూపర్‌విజన్ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది.
ఈ రిక్వెస్ట్‌ను పిల్లలు ఓకే చేయడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఎలా ఉపయోగిస్తున్నారనేది సులువుగా తెలుసుకోవచ్చు.ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికన్ యూజర్లకు అందుబాటులో ఉండగా త్వరలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సెరీ ప్రకటించారు.
ఈ ఫీచర్ వలన అనేక ఉపయోగాలు కలవు.దీని ద్వారా పిల్లలు అభ్యంతరకరమైన యాప్స్ డౌన్‌లోడ్ చేయకుండా కట్టడి చేయొచ్చు.అలాగే వారు ఏమి చూస్తున్నారో కూడా ఈజీగా తెలుసుకొనే వెసులుబాటు వుంది.అయితే ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ పరిమితి మించి వినియోగించకుండా స్వీయ నియంత్రణ కోసం ‘టేక్ ఏ బ్రేక్‘ ఫీచర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసినదే.
ఇక ఈ ఫీచర్‌తో తమ పిల్లలు ఫోన్స్ లో అనవసర కార్యకలాపాలు చేయకుండా జాగ్రత్త పడవచ్చు.