శస్త్ర చికిత్సను ఆధునిక యుగం బహుమతిగా భావిస్తున్నాం.అది పూర్తి నిజం కాదని తేలిపోయింది.
తవ్వకాల్లో ఇలాంటి ఇందుకు సంబంధించిన ఆధారాలు వెల్లడవుతున్నాయి.వేల సంవత్సరాల క్రితం కూడా శస్త్రచికిత్సలు జరిగాయని ఇవి నిరూపిస్తున్నాయి.చెవి శస్త్రచికిత్సకు సంబంధించిన రుజువు ఇప్పుడు బయటపడింది.5,300 సంవత్సరాల నాటి పుర్రె దీనికి సాక్ష్యంగా తెరపైకి వచ్చింది.వెబ్‌సైట్ WION నివేదిక ప్రకారం, పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం స్పెయిన్‌లోని ఒక సమాధిలో 5,300 సంవత్సరాల నాటి పుర్రెను కనుగొన్నారు.దీని విశేషమేమిటంటే ప్రపంచంలోనే చెవి శస్త్రచికిత్సకు ఇది పురాతన సాక్ష్యంగా నిలిచింది.
పుర్రెలో ఎడమ చెవి చుట్టూ అనేక కట్ గుర్తులు కనిపిస్తాయి.
అంటే నొప్పిని తగ్గించడానికి చెవి చుట్టూ శస్త్రచికిత్స చేసి ఉండాలి.
నొప్పి నుండి ఉపశమనం పొందడానికి శస్త్రచికిత్స జరిగింది.సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో విడుదల చేసిన ఒక కథనంలో, స్పానిష్ పరిశోధకులు ఇలా తెలిపారు “ఈ సాక్ష్యాలు మాస్టోయిడెక్టమీని సూచిస్తాయి.నాటిరోజుల్లో మనిషి అనుభవించిన నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు బహుశా శస్త్రచికిత్స జరిగింది.” ఈ పుర్రె నియోలిథిక్ యుగంలో నివసించిన మధ్య వయస్కురాలికి చెందినదని పరిశోధకులు నిర్ధారించారు.

ఇది డోల్మెన్ డి ఎల్ పెండన్ అని పిలిచే సమాధిలో కనుగొన్నారు.ఇది స్పెయిన్‌లోని బర్గోస్‌లో ఉంది.2016లో, వల్లాడోలిడ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు దాదాపు 100 మంది ఇతర అవశేషాలతో పాటు పుర్రెను కనుగొన్నారు.పుర్రె దాని మాస్టాయిడ్ ఎముకల దగ్గర పుర్రెకు రెండు వైపులా రెండు రంధ్రాలు ఉన్నట్లు రుజువును చూపించింది.
చెవిపై పెరిగిన ఒత్తిడిని తగ్గించడానికి శస్త్రచికిత్స ద్వారా ప్రయత్నించినట్లు ఇది సూచిస్తున్నది.