వణికించే 250 మిలియన్ సంవత్సరాల సీ డెవిల్.. పూర్తి వివరాలివే!

దాదాపు 250 మిలియన్ సంవత్సరాల నాటిదని భావిస్తున్న ఆస్ట్రేలియాలో తేలు జాతికి చెందిన శిలాజం లభ్యమయ్యింది.వుడ్‌వార్డోప్టెరస్ ఫ్రీమనోరమ్ అనే ఈ తేలును ‘సీ డెవిల్’ అని కూడా పిలుస్తారు.ఎందుకంటే ఈ పెద్ద తేలు నదులు, సముద్రాలు, సరస్సులలో కనిపించేది.‘సైన్స్ న్యూస్’ వార్తల ప్రకారం, ఈ తేలు పొడవు ఒక మీటర్.ఈ జీవి నీటిలోనే నివాసం ఉండేది.వుడ్‌వార్డోప్టెరస్ ఫ్రీమనోరమ్ గురించి చాలాకాలంగా అధ్యయనం జరుగుతోంది.ఇప్పుడు ఈ శిలాజాన్ని క్వీన్స్‌లాండ్ మ్యూజియంలో ఉంచారు.1990వ దశకంలో సెంట్రల్ క్వీన్స్‌లాండ్‌లోని గ్రామీణ ప్రాంతంలో మొదటిసారిగా ఈ శిలాజం కనిపించింది.అప్పటి నుండి పరిశోధనలు సాగుతున్నాయి.ఈ శిలాజాన్ని ఇతర జాతుల తేళ్లతో పోల్చారు.వాటి మధ్య సారూప్యతలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

 Sea Scorpion Fossil Of 252 Million Years , 252 Million Years , Sea Scorpion , Au-TeluguStop.com

కరోనా కారణంగా అమలు చేసిన లాక్‌డౌన్ సమయంలో పరిశోధన పనులు చాలా వేగంగా జరిగాయి.

ఎందుకంటే ఆ సమయంలో మ్యూజియం మూసివేశారు.ఈ శిలాజం ఇతర జాతుల కంటే 10 మిలియన్ సంవత్సరాల పూర్వానిదిగా చెబుతున్నారు.

క్వీన్స్‌ల్యాండ్ మ్యూజియం అధికారి ఆండ్రూ రోస్‌ఫెల్డస్ మాట్లాడుతూ, ఈ సముద్రపు తేలు శిలాజం దాదాపు 252 మిలియన్ సంవత్సరాల నాటిదని చెప్పారు.శాస్త్రీయ భాషలో యూరిప్టెరిడా అని పిలిచే శిలాజంపై పరిశోధనలు చేశామన్నారు.

ఇది మొత్తం ప్రపంచంలోనే చివరి యూరిప్టెరిడా అని తెలిపారు.శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రత్యేకమైన జీవ జాతి ప్రపంచం నుండి తుడిచిపెట్టుకుపోయింది.

దీంతో ఈ శిలాజం నుండి సమాచారం సేకరిస్తున్నారు.ఆస్ట్రేలియానే కాకుండా ఇతర దేశాలలో అటువంటి తేళ్లు ఉన్నట్లు వెల్లడయ్యింది.

దీనికి సంబంధించి హిస్టారికల్ బయాలజీ జర్నల్‌లో ఒక అధ్యయనం కూడా ప్రచురితమయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube