వణికించే 250 మిలియన్ సంవత్సరాల సీ డెవిల్.. పూర్తి వివరాలివే!

దాదాపు 250 మిలియన్ సంవత్సరాల నాటిదని భావిస్తున్న ఆస్ట్రేలియాలో తేలు జాతికి చెందిన శిలాజం లభ్యమయ్యింది.

వుడ్‌వార్డోప్టెరస్ ఫ్రీమనోరమ్ అనే ఈ తేలును 'సీ డెవిల్' అని కూడా పిలుస్తారు.

ఎందుకంటే ఈ పెద్ద తేలు నదులు, సముద్రాలు, సరస్సులలో కనిపించేది.'సైన్స్ న్యూస్' వార్తల ప్రకారం, ఈ తేలు పొడవు ఒక మీటర్.

ఈ జీవి నీటిలోనే నివాసం ఉండేది.వుడ్‌వార్డోప్టెరస్ ఫ్రీమనోరమ్ గురించి చాలాకాలంగా అధ్యయనం జరుగుతోంది.

ఇప్పుడు ఈ శిలాజాన్ని క్వీన్స్‌లాండ్ మ్యూజియంలో ఉంచారు.1990వ దశకంలో సెంట్రల్ క్వీన్స్‌లాండ్‌లోని గ్రామీణ ప్రాంతంలో మొదటిసారిగా ఈ శిలాజం కనిపించింది.

అప్పటి నుండి పరిశోధనలు సాగుతున్నాయి.ఈ శిలాజాన్ని ఇతర జాతుల తేళ్లతో పోల్చారు.

వాటి మధ్య సారూప్యతలపై పరిశోధనలు జరుగుతున్నాయి.కరోనా కారణంగా అమలు చేసిన లాక్‌డౌన్ సమయంలో పరిశోధన పనులు చాలా వేగంగా జరిగాయి.

ఎందుకంటే ఆ సమయంలో మ్యూజియం మూసివేశారు.ఈ శిలాజం ఇతర జాతుల కంటే 10 మిలియన్ సంవత్సరాల పూర్వానిదిగా చెబుతున్నారు.

క్వీన్స్‌ల్యాండ్ మ్యూజియం అధికారి ఆండ్రూ రోస్‌ఫెల్డస్ మాట్లాడుతూ, ఈ సముద్రపు తేలు శిలాజం దాదాపు 252 మిలియన్ సంవత్సరాల నాటిదని చెప్పారు.

శాస్త్రీయ భాషలో యూరిప్టెరిడా అని పిలిచే శిలాజంపై పరిశోధనలు చేశామన్నారు.ఇది మొత్తం ప్రపంచంలోనే చివరి యూరిప్టెరిడా అని తెలిపారు.

శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రత్యేకమైన జీవ జాతి ప్రపంచం నుండి తుడిచిపెట్టుకుపోయింది.

దీంతో ఈ శిలాజం నుండి సమాచారం సేకరిస్తున్నారు.ఆస్ట్రేలియానే కాకుండా ఇతర దేశాలలో అటువంటి తేళ్లు ఉన్నట్లు వెల్లడయ్యింది.

దీనికి సంబంధించి హిస్టారికల్ బయాలజీ జర్నల్‌లో ఒక అధ్యయనం కూడా ప్రచురితమయ్యింది.

రాకాసి బల్లితో కుక్కలు భయంకరమైన పోరాటం.. వీడియో చూస్తే గుండె గుబేల్..?