అశ్విని దత్.విజయవాడ వాస్తవ్యుడైన అశ్విని దత్( Ashwini Dutt ) ఎదురులేని మనిషి సినిమాతో నిర్మాతగా మారాడు.1975లో మొట్ట మొదటి సారి సినిమా రంగంలోకి అడుగుపెట్టి నేటి వరకు దాదాపు 30 కి పైగా సినిమాలను నిర్మించాడు.ఎన్టీఆర్( NTR ) వంటి నటుడి కి ప్రాణ మిత్రుడు గా ఉన్న అశ్వినీ దత్ ఆయన సలహాతోనే వైజయంతి మూవీస్( Vyjayanthi Movies ) అనే పేరు పెట్టి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు.
ఇక అశ్విని దత్ కి ముగ్గురు కుమార్తెలు కాగా ఆయన సినిమా రంగానికి కూడా వారే వారసులుగా ఉన్నారు.పెద్దమ్మాయి స్వప్న అలాగే రెండో అమ్మాయి ప్రియాంక పూర్తి స్థాయిలో సినిమాలకే తమ జీవితాన్ని అంకితం చేయగా రెండవ కూతురు ప్రియాంక భర్త నాగ అశ్విన్( Naga Ashwin ) టాలీవుడ్ లో మంచి డైరెక్టర్ గా ఉన్నారు.
ఇక అశ్విని దత్ కెరియర్ లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంద్ర కాగా ఆయనను సినిమా పరిశ్రమ నుంచి దాదాపు తప్పుకునేలా చేసిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి.2002లో తీసిన చిరంజీవి చిత్రం ఇంద్ర( Indra ) ద్వారా ఇప్పటి వరకు తాను సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా లాభాలు పొందిన సినిమా అని చెప్పారు అశ్విని దత్ ఆ చిత్రం ద్వారా ఏడు కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయట.అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్ అని అంటున్నారు అశ్విని దత్.ఇక ఆయన జీవితంలో 2011లో వచ్చిన శక్తి సినిమా( Shakti movie ) అత్యంత ప్రభావ వంతమైన సినిమా అని దాని ద్వారా 32 కోట్ల రూపాయలను కోల్పోయానని తద్వారా సినిమా ఇండస్ట్రీ నుంచి దాదాపు ఏడేళ్ల పాటు విరామం తీసుకున్నానని కూడా చెప్పారు.
తాను మళ్ళీ సినిమాలు తీయాలని ఉద్దేశం లేకపోయినప్పుడు తన కుమార్తెలు ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారని అలాగే సక్సెస్ ఫుల్ గా కూడా ఆ పనిని చేస్తున్నారని గర్వపడుతున్నారు.స్వప్న మరియు ప్రియాంక ఇద్దరు 2018 లో మహానటి అనే సినిమా తీసి మళ్లీ వైజయంతి మూవీస్ కి ప్రాణం పోశారు.ఆ సినిమా తర్వాత మహర్షి, దేవదాస్, సీతారామం సినిమాలు నిర్మించారు.ఇప్పుడు ప్రభాస్ తో ప్రాజెక్టు కే సినిమా తీస్తున్నారు.