తెలుగు సినిమాల్లో సంగీత దర్శకత్వం విషయానికి వస్తే మొదటి నుంచి దేవి శ్రీ ప్రసాద్( DSP ), థమన్( Thaman ) పేర్లు గత కొన్నేళ్లుగా వినిపిస్తూ వస్తున్నాయి.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
వారు పెద్ద హీరోల సినిమాలకు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకో కొత్త పాన్ ఇండియా చిత్రాల్లో మాత్రం ఈ ఇద్దరు పేర్లు ఎక్కడ కనిపించడం లేదు. నాని, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్సేన్, నితిన్ లాంటి హీరోలు అందరూ కూడా పక్క భాషల సంగీత దర్శకుల( Music directors )పై ఆధారపడుతూ ఉండడం విశేషం.
ఇక కేవలం ఒకటి రెండు సినిమాలకు మాత్రమే పరిమితమై భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి చిత్రాల్లో సంగీతం అందిస్తారో లేదో క్లారిటీ లేకుండా పోయింది పైన చెప్పుకున్న ఈ ఇద్దరు సంగీత దర్శకులకు.

గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరు సంగీత దర్శకులు తెలుగు ఇండస్ట్రీని రూల్స్ చేస్తూ వస్తున్నారు.ప్రస్తుతం మన తెలుగు హీరోలు అంతా కూడా కన్నడ, మలయాళం, కన్నడ, తమిళ్ సంగీత దర్శకులను తెలుగులో పరిచయం చేస్తూ వారితో ఒకటికి మించి సినిమాలు చేస్తున్నారు.మరి పరిస్థితి ఇలా ఎందుకు మారిపోయింది అంటే అందుకు గల ముఖ్యమైన కారణం ఎక్కువ యేళ్లు భరించడమే.
పైగా ఈ సంగీత దర్శకులకు డబ్బు కూడా ఎక్కువగా చెల్లించాల్సి రావడం, కాపీ ట్యూన్స్, మొనాటని వంటి కొన్ని అంశాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.అందుకే మన హీరోలంతా ప్రస్తుతం పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు.

కీరవాణి( Keeravani ) లాంటి సంగీత దర్శకుడు కేవలం రాజమౌళి కాంపౌండ్ కే పరిమితమయ్యాడు.దాంతో తమిళ్ నుంచి సంతోష్ నారాయణన్, అనిరుద్ మరియు జీ వి ప్రకాష్ రాగ, కన్నడ నుంచి రవి బస్రుర్, అజనీష్ లోక్ నాథ్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు.అలాగే మలయాళం నుంచి హిషామ్ అబ్దుల్ వాహిమ్ తెలుగు సినిమాలకు పరిచయం అవబోతున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో దేవి శ్రీ ప్రసాద్, థమన్ కనుమరుగు అయ్యే పరిస్థితి లేకపోలేదు.







