తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీలో కలహాలు అనేవి చాలా సర్వసాధారణమైన విషయం.
అయితే రేవంత్ కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాక ఇక కాంగ్రెస్ సీనియర్ లకు, రేవంత్ కు మధ్య పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే.అయితే కాంగ్రెస్ సీనియర్ ల అభ్యంతరాలను ఏ మాత్రం లెక్క చేయని పరిగణలోకి తీసుకోని రేవంత్ తనదైన శైలిలో ముందుకు వెళ్తూ తనతో కలిసి వచ్చే వారికి పార్టీ పరమైన బాధ్యతలు అప్పగించుకుంటూ తిరిగి గాడిలో పెట్టాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే, అయితే మొదటి నుండి రేవంత్ నియామకాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్తమ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం దగ్గర వ్యక్తం చేసినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోవడంతో ఇక అసంతృప్తిగా నే కాంగ్రెస్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమితో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో ఉన్న పరిస్థితులలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కు భారీ షాక్ ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.అయితే ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కు భారీ షాక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మాజీ ఎంపీ వివేక్ కోమటిరెడ్డి బ్రదర్స్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా కానీ చెప్పిన పరిస్థితి లేకున్నా టీఆర్ఎస్ తో గట్టిగా పోరాడే పార్టీతో నడుస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితుల్లో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయిందని మనం అర్ధం చేసుకోవచ్చు.







