ఇండియాలో ఫోన్ వాడకం రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది.ఒకప్పుడుతో పోల్చుకుంటే డేటా వినియోగం పది ఇంతలు పెరిగిపోయింది.
జీఓ ఎంట్రీ తరువాతే డేటా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.అయితే తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం మొబైల్ బ్రాడ్ బాండ్ వాడే వారి సంఖ్య 34.5 కోట్ల నుంచి 76.5 కోట్లకు పెరిగింది.
సగటుకు ఒక్కొక్కరు నెలకు 17 జీబీ డేటా వినియోగిస్తున్నట్లు తేలింది.ముఖ్యంగా యువత రోజువారిగా 8గంటలు సెల్ ఫోన్ కు సమయం వెచ్చిస్తున్నట్లు చెబుతున్నారు.నోకియా మొబైల్ బ్రాడ్ బాండ్ ఇంటెక్స్ రిపోర్ట్స్ ప్రకారం దేశంలో డేటా వినియోగం బాగా పెరిగింది.4జీ మొబైల్ డేటా వినియోగం 31శాతం పెరిగితే నెలవారి సగటు వినియోగం 26.6శాతం పెరిగింది.గతేడాది 4కోట్ల మంది 4జీ సర్వీసు ఆప్ గ్రేడ్ కావడం, సర్వీసు పొందడం జరిగినట్లుగా నివేదికలో పేర్కొన్నారు.
యువత బానిసయ్యారు

ముఖ్యంగా యువత సెల్ ఫొన్ కు బానిస అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.రోజువారి తిండికంటే కూడా నెలవారీగా వాడేసే డేటా ఎక్కువైపోతుందన్న మాట కూడా వినిపిస్తోంది.యువత అమూల్యమైన సమయాన్ని కూడా మొబైల్ ను వినియోగించేందుకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.







