యాంకర్ గా పనికిరావని ముఖం మీదే అనేశారు.. యాంకర్ శివ కామెంట్స్ వైరల్!

యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో యాంకర్ శివ ఒకరు.బిగ్ బాస్ గత సీజన్ల సమయంలోనే యాంకర్ శివ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది.

అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ గా యాంకర్ శివ ఎంపిక కావడంతో పాటు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.14వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వచ్చిన శివ యాంకర్ గా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.శ్రీకాకుళానికి చెందిన శివ వైజాగ్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు.

తాను 40,000 రూపాయలు ఖర్చు చేసి ఇంటర్వ్యూలు చేశానని ఆ ఫుటేజీని ఎడిటర్ దగ్గరకు తీసుకెళితే ఎడిటర్ తాను యాంకర్ గా పనికిరావని ఘోరంగా అవమానించాడని శివ అన్నారు.ఇతరులు ఏం చెప్పినా కుర్చీలో కూర్చుని ప్రశ్నించడం తనకు ఇష్టమని శివ వెల్లడించారు.

ఒకానొక సమయంలో అమ్మకు కూడా తాను నచ్చలేదని శివ చెప్పుకొచ్చారు.

అందువల్ల తాను ఇంటినుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని శివ కామెంట్లు చేశారు.ప్రస్తుతం తనకు డబ్బులు అవసరమని చెల్లికి పెళ్లి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని శివ వెల్లడించారు.బిగ్ బాస్ హౌస్ లో 24 గంటలు మసాలా అందిస్తానని శివ కామెంట్లు చేశారు.

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో శివ ఎన్ని వారాలు ఉంటారో చూడాల్సి ఉంది.శివ కోసమే బిగ్ బాస్ షోను చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది.

పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.బిగ్ బాస్ షోపై ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా ఈ షోను ఆదరించే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు సబ్ స్క్రైబర్ల సంఖ్య పరిమితం కాగా ఈ షో ఓటీటీలో కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement
" autoplay>

తాజా వార్తలు