జీ 5 ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 2' ట్రైలర్ విడుదల... 21న సిరీస్ స్ట్రీమింగ్!

ప్రముఖ ఓటీటీ వేదిక జీ 5లో విడుదలైన ఒరిజినల్ సిరీస్ లూజర్ చూశారా? ఆ సిరీస్‌ను అంత త్వ‌ర‌గా వీక్షకులు మర్చిపోలేరు.టైటిల్ లూజర్ కావచ్చు.

కానీ, రిజల్ట్ విషయంలో విన్నరే.వీక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన సిరీస్ అది.ఇప్పుడు ఆ సిరీస్‌కు సీక్వెల్ వస్తోంది.అదీ జీ 5లోనే.

విలక్షణ కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలు.అన్ని వర్గాల ప్రజలకు వినోదం అందిస్తున్న ఏకైక ఓటీటీ వేదిక జీ 5.జీ 5.ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది.స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ లూజర్తో వీక్షకుల మనసులు గెలుచుకుంది.

ప్రజల కోరిక మేరకు ఇప్పుడు లూజర్ 2 తీసుకువస్తోంది.ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్ సిరీస్ లూజర్ 2.హిట్ సిరీస్ లూజర్కు సీక్వెల్ ఇది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తొలి సీజన్ తెరకెక్కింది.లూజర్ 2కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు.దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్.జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించిన ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ కిదాంబి శ్రీ‌కాంత్ విడుద‌ల చేశారు.

Advertisement

లూజర్ 2 ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఉంది.విల్సన్ కుమారుడు క్రికెటర్ కావాలని అనుకోవడం. సూరి యాదవ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఎలా మారాడు? రూబీ కథేంటి? అనేది ఆసక్తికరంగా ఉంది.డైలాగులు బావున్నాయి.

ఈ నెల 21న జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.సూరి పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి, మాయ‌గా ధ‌న్యా బాలకృష్ణ‌న్‌, రూబీ పాత్ర‌లో క‌ల్పికా గణేష్, ఆమె తండ్రి ఇర్ఫాన్‌గా షాయాజీ షిండే, విల్స‌న్ పాత్ర‌లో శ‌శాంక్‌, జాన్‌గా హ‌ర్షిత్ రెడ్డి, గోవ‌ర్ధ‌న్ పాత్ర‌లో సూర్య‌, ప‌ల్ల‌విగా పావ‌నీ గంగిరెడ్డి, రుక్ష‌ణ‌గా స‌త్య కృష్ణ‌న్ న‌టించిన లూజ‌ర్ 2 ఒరిజిన‌ల్ సిరీస్‌కు శ్రీ‌ను, టిప్పు, అన్నీ ఇత‌ర తాగార‌ణం.

ఈ ఒరిజిన‌ల్ సిరీస్‌కు రచన: సాయి భరద్వాజ్, శ్రవ‌ణ్ మాదాల‌, అభిలాష్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైన్: ఝాన్సీ, క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజల, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్: రజనీ, కూర్పు: కుమార్ పి.అనిల్‌, ఛాయాగ్ర‌ణం: న‌రేష్ రామ‌దురై, సంగీతం: సాయి శ్రీ‌రామ్ మ‌ద్దూరి, ద‌ర్శ‌క‌త్వం: శ్రవ‌ణ్ మాదాల‌, అభిలాష్ రెడ్డి, ప్రొడ‌క్ష‌న్‌: జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు