టికెట్ల రేట్ల ఇష్యూ.. చంద్రబాబు వరకు సాగుతూనే ఉంది

తెలుగు సినిమా పరిశ్రమ కరోనాతో దెబ్బ తిన్నది.ఈ సమయంలో ఏపీ లో టికెట్ల రేట్ల చాలా తగ్గించారు.

తెలంగాణ లో ఉన్న టికెట్ల రేట్లకు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లకు చాలా వ్యత్యాసం ఉంది.ఏపీలో మరియు తెలంగాణ లో తేడా గా రేట్లు ఉండటం వల్ల గందర గోళ పరిస్థితులు ఉన్నాయి.

అందుకే ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో నిర్మాతలు మరియు బయ్యర్లు గత కొన్ని రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు.తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖులు పలువురు ఇప్పటికే టికెట్ల రేట్ల గురించి మాట్లాడేందుకు ముందుకు రావాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే ఏపీ ప్రభుత్వంకు విజ్ఞప్తి చేయగా మరో వైపు కొందరు మాత్రం ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లు సరిపోతాయి అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఏపీ లో ఉన్న టికెట్ల రేట్ల ఇష్యూ పెద్ద ఎత్తున రాజుకుంటున్న సమయంలో వైకాపా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఆశ్చర్య కర వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

తెలుగు సినిమా నిర్మాతలు బలికి కొట్టుకుంటున్నారు.సినిమా నిర్మాతలు మరియు హీరోలు అంతా కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపుతున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు.

ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.చంద్రబాబు నాయుడుకు ఇండస్ట్రీలో చాలా మంది మద్దతుగా ఉన్నారు.

అందుకే ఇలా టికెట్ల రేట్లను తగ్గించాం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.ఇలా సినిమా ను రాజకీయం లోకి లాగడం అనేది దౌర్భాగ్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వైకాపా యొక్క అసలు బుద్ది ఇదే అన్నట్లుగా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ వివాదం తెలుగు దేశం పార్టీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో మరింత రాజకీయ రంగు పులుముకునే అవకాశం కనిపిస్తుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు