ఇంత ఖరీదైన విడాకుల గురించి మీరు విని ఉండరు.. భరణంగా ఎంత ఇచ్చారంటే?

మాములుగా పెళ్లి చేసుకుని ఒక్కటైనా భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటూ ఒకరికొకరు సర్దుకుపోతూ బ్రతకాలి.

లేదు మేము సర్దుకు పోము అంటే ఆ విషయం చాలా దూరం వెళ్తుంది.

భార్య భర్తల మధ్య గొడవలు మరీ ఎక్కువ అయితే అవి కాస్త విడాకుల వరకు వెళ్తాయి.అయితే విడాకుల సమయంలో భర్త భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఆమె విడాకుల తర్వాత జీవించడానికి ఆర్ధికంగా భర్త సహాయం చేయాలి.అయితే భరణం ఎంత ఉంటుంది.మహా అంటే ఎంత ఉంటుంది.100 కోట్ల వరకు భరణం ఇచ్చాడు అని మనం విని ఉంటాం.లేదంటే మరీ కోటీశ్వరుడు అయితే 500 కోట్ల వరకు కూడా చెల్లించాడు అని విని ఉంటాం.

కానీ ఇతడు విడాకుల తర్వాత భార్యకు భరణం చెల్లించే విషయంలో కొత్త రికార్డ్ సృష్టించాడు.ఇంత వరకు ఇంత భారీ మొత్తాన్ని ఏ భర్త కూడా తన భార్యకు చెల్లించి ఉండడు.కానీ ఇతడు మాత్రం ఏకంగా తన మాజీ భార్యకు రూ.5,555 కోట్లను భరణంగా ఇచ్చి కొత్త రికార్డ్ ను సృష్టించాడు దుబాయ్ కి చెందిన ఒక రాజు.

Advertisement

బ్రిటన్ హై కోర్ట్ వెలువరించిన తీర్పులో అతడు తన మాజీ భార్యకు ఏకంగా రూ.5,555 కోట్లను భరణంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

దుబాయ్ కు చెందిన రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ఆయన భార్య జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ విడాకులు తీసుకున్నారు.అతడి వయసు 72 సంవత్సరాలు కాగా.

ఆమె వయసు 47 సంవత్సరాలు.వీరి విడాకుల కేసును బ్రిటన్ కోర్టు విచారణ జరిపి తాజాగా సంచలన తీర్పు వెలువడించింది.

వారికి పుట్టిన పిల్లలకు 554 మిలియన్ పౌండ్లు భరణంగా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 554 పౌండ్లు అంటే రూ.5,555 కోట్లు అన్నమాట.బ్రిటిష్ చరిత్రలోనే ఇవే ఖరీదైన విడాకులు అని చెబుతున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ మొత్తంలో తన భార్యకు మూడు నెలల లోపు రూ.2,521 కోట్లు చెల్లించాలని మిగతా రూ.2,907 కోట్లు వారి పిల్లలకు బ్యాంక్ గ్యారెంటీతో చెల్లించాలని తీర్పు చెప్పింది.ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.

Advertisement

ఇంత ఖరీదైన విడాకులు ఇంత వరకు చూడలేదని అందరు అనుకుంటున్నారు.

తాజా వార్తలు