విశాఖ ఉక్కు ఆంద్రుల హక్కు దీనిపై సీఎం అఖిలపక్షం ఏర్పాటు చేయాలి పోతిన వెంకట మహేష్..

మా అధినేత విశాఖ ఉక్కు మీద దీక్ష చేయగానే వైసీపీ నేతలు బయటకి వచ్చారు. 22మంది ఎంపీలు ఉన్నా పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకునే ధైర్యం కూడా లేదు తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్ ప్రకారమే నడుచు కుంటున్నారు .

విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో లో మోడీని కలిసి ఫొటోలు దిగుతారు .ఢిల్లీలో రగ్గులు కప్పుకుని తిరగడం కాదు.రాష్ట్ర సమస్య ల‌పై స్పందించండి విశాఖ ఉక్కు ఆంద్రుల హక్కు.

దీనిపై సీఎం అఖిలపక్షం ఏర్పాటు చేయాలి .తాడేపల్లి ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటున్న జగన్ ను నిద్ర లేపండి వైసీపీ ఎంపిలు, ఎమ్మెల్యే లు జగన్ జపం చేయడం‌ మానుకోండి పోరాట స్పూర్తి లేకపోతే రాష్ట్రానికి ద్రోహం‌ చేసిన వారిగా మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్ అనేక‌ సందర్భాలలో స్పందించారు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా ఉండేలా కృషి చేస్తున్నారు .నిన్న పవన్ కళ్యాణ్ దీక్ష ముగిసిందో లేదో అంబటి రాంబాబు వంటి‌ నాయకులు నోళ్లు పారేసుకుంటున్నారు.అంబటి వంటి వారు కూడా పవన్ కళ్యాణ్ ను మిమర్శిస్తారా ప్రెస్ మీట్ లో అంబటి హావభావాలు అందరూ చీదరించుకుంటున్నారు.

ట్విట్టర్లో అడల్ట్ కంటెంట్ ఉన్న వాటినే అంబటి రాంబాబు ఫాలో అవుతున్నాడు.అన్నీ ఫోన్ ద్వారా.పనులు చేయుంచుకునే ప్రావీణ్యం సత్తెనపల్లి నియోజకవర్గానికి అంబటి ఏమి అభివృద్ధి చేశారో  చెప్పాలి .మరి మీ జగనన్నతో మంచి పనులు ఎందుకు చేయించడం లేదో దళిత మహిళ అని మంత్రిని  కేటాయిస్తే అభివృద్ధి ని గాలి కొదిలేశారు పవన్ ను ప్రశ్నించే వారు ముందు సీఎం ను నిలదీయాలి .హోం శాఖకు సంబంధించిన అంశాలలో పెత్తనం అంతా సజ్జలదే హోంగార్డులను కూడా నియమించలేని హోం మంత్రి మీరు ముందు మీ శాఖలో పట్టు సాధించి.అందరికి మంచి చేయండి నష్టపోయిన, కష్టపడుతున్న రైతులు ,మహిళల కు న్యాయ్యం చేయాలని మీ జగనన్న ని కోరండి.

వైసీపీ  నేతలకు దమ్ముంటే విశాఖ ప్రైవేటీకరణ ను ఆపేలా పోరాటం చేయాలి.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు