ఆ మగాళ్లిద్దరు అలాంటి మెసేజ్ లు పెట్టారంటూ అవి బయటపెట్టిన సింగర్.. వైరల్!

సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుని ఎంతోమంది హీరోయిన్ లకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక చిన్మయి ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా మీటూ ఉద్యమం ద్వారా ఎంతో పోరాటం చేసింది.ఎంతోమంది బడా బాబుల బాగోతం బయట పెడుతూ చిన్మయి కూడా సోషల్ మీడియాలో ఎన్నో నెగిటివ్ కామెంట్లను ఎదుర్కొంది.

ఇలాంటి సంఘటనలు ఎన్ని ఎదురైనా ఈమె మాత్రం సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాల గురించి స్పందిస్తూ ఉంటారు.ఇక సోషల్ మీడియా వేదికగా మహిళలపై జరిగే అరాచకాలను ఎదిరిస్తూ ఎన్నో సలహాలు ఇస్తూ మహిళలను ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు.

అలాగే ఎంతోమంది మహిళలు అమ్మాయిలు ఇంట్లో వారు ఎదుర్కొంటున్న కష్టాలు గురించి చెబుతూ ఈమె సలహాలు తీసుకుంటూ ఉంటారు.ఇలా అబ్బాయి లకు వ్యతిరేకంగా మహిళలను సపోర్ట్ చేస్తూ ఈమె చేసే కామెంట్స్ పలువురికి నచ్చకపోవడంతో ఈమె పై నెగిటివ్ ప్రచారం చేస్తుంటారు.

Advertisement

ఈ క్రమంలోనే చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా అబ్బాయిలు ఎంత వెధవ అయిన వారికిచ్చే కట్టబెడుతున్నారు.ఇలాంటి వాటి గురించి పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉంటారు.మరి కొంతమంది పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకోకుండా అమ్మాయిలకు నచ్చకపోయినా ఓకే క్యాస్ట్ వారికి ఇచ్చి పెళ్లి చేస్తుంటారని,ఎన్నారైలకు ఇవ్వాలంటే కోట్లలో కట్నాలు ఇవ్వాలంటూ ఈమె చేసిన వ్యాఖ్యలకు ఇద్దరు ఎన్నారైలు తనకు మద్దతుగా నిలిచారు.

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ మీరు చెప్పినట్టుగానే చాలామంది ఉన్నారు కానీ మీరు వెళ్తున్న మార్గం ఎంతో సరైనది మీ గురించి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చిన వాటి గురించి పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళండి.మీరు అమ్మాయిల సమస్యల పై స్పందిస్తూ వారి సమస్యలకు పరిష్కారాలు చెబుతూ వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తున్నారు అంటూ ఆ ఎన్ఆర్ఐ లు చిన్మయికి మద్దతు తెలిపారు.

ఈ విషయం గురించి సింగర్ స్పందిస్తూ నిజమైన మనుషులు,నీతి నిజాయితీ గా ఉండే మగాళ్లకు నా పోస్టుల వల్ల ఎలాంటి అభ్యంతరం లేదు.కానీ ఒక ఆడది నో చెబితే వారి అహం ఎక్కడ దెబ్బతింటుంది వారి ఆధిపత్యం ఎక్కడ కోల్పోతారు అనిబాధపడే వారికి మాత్రమే నేను చేసే పోస్టులు బాధాకరంగా ఉంటాయి.అలాంటి వారు మాత్రమే ఇలా నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.

కానీ నాకు మద్దతుగా నిలిచిన ఎన్నారైలు బంగారం అంటూ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు