ఒకే హీరోయిన్ తో 130 సినిమాలు తీసిన హీరో.. అంతేకాదు మూడు గిన్నిస్ రికార్డ్స్?

సినీ ఇండస్ట్రీల గురించి అందులో నటించే నటీనటుల, దర్శకుల టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఎందుకంటే ఒక మామూలు కథను అందంగా, అద్భుతంగా, రంగులమయంగా తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తారు.

అలా ఆ కథకు తగ్గట్టుగా నటించే నటీనటులను ఎంచుకొని మంచి సక్సెస్ లు అందుకొని ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంటుంటారు.ఇక కొన్ని కొన్ని సార్లు సినిమాల పరంగా నటీనటులకు గిన్నిస్ రికార్డు కూడా అందుతుంది.

అందరి నటీనటుల కంటే ఎక్కువ సినిమాలలో నటించిన నటులకు గిన్నిస్ రికార్డు దక్కుతుంది.అంతేకాకుండా కొన్ని ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కూడా గిన్నిస్ రికార్డు అందుతుంది.

అలా ఓ హీరో కి కూడా ఏకంగా మూడు గిన్నిస్ రికార్డులు అందాయి.మామూలుగా ఒక గిన్నిస్ రికార్డు అందుకోవడం కోసమే ఎంతో తాపత్రయ పడుతుంటారు.

Advertisement

అలాంటిది ఆ హీరో ఏకంగా మూడు రికార్డులు సాధించడంతో అది చెప్పుకోదగ్గ విషయమే.అంతేకాకుండా ఆ హీరో ఒకే హీరోయిన్ తో 130 సినిమాలలో నటించాడట.

మామూలుగా ఒక హీరో హీరోయిన్ కొన్ని సినిమాలలో కలిసి నటించిన సందర్భాలు ఉండగా ఆ హీరో మాత్రం ఆ హీరోయిన్ తో 130 సినిమాలను తీశాడు అంటే ఆశ్చర్యపడాల్సిన విషయమే ఇది.

ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.ఒకప్పటి భారతీయ చలనచిత్ర నటుడు ప్రేమ్ నజీర్.ఈయన ఇండస్ట్రీలలో ఎవర్ గ్రీన్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.

మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీ లో ఉండి మంచి పేరు సంపాదించుకున్నాడు.తన చివరి జీవితం వరకు ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు నజీర్.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఈయన 1952లో ఆకలి అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.ఆ తర్వాత ఏడాది తండ్రి అనే డబ్బింగ్ సినిమాలో నటించాడు.

Advertisement

అలా చాలావరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఇక మలయాళంలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

ఇక ఈయనకు మూడు గిన్నిస్ రికార్డులు అందగా అందులో మొదటిది ఆయన మొత్తం 725 సినిమాలలో హీరోగా నటించినందుకు దక్కింది.రెండవది హీరోయిన్ షీలా తో కలిసి 130 సినిమాలలో నటించడంతో గిన్నిస్ రికార్డులో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక మూడవది 1979లో 80 మంది హీరోయిన్స్ తో 40 సినిమాలలో నటించాడు.

అలా ఒకే ఏడాది ఇన్ని సినిమాల్లో నటించినందుకు మూడవ గుర్తింపు అందుకున్నాడు.

ఇక ఈయన 59 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు1989లో మద్రాసులో మిజిల్స్ అనే వ్యాధికి చికిత్స పొందుతూ మరణించాడు.ఈయన బ్రతికున్నంత కాలం సమాజ సేవలు కూడా చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎంతోమందికి ఆర్థిక సహాయం చేశాడు.

అంతేకాకుండా కళారంగానికి చేసిన సేవలు కూడా పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు నజీర్.

తాజా వార్తలు