ఆ రోజును జీవితంలో మర్చిపోలేను.. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కోటశ్రీనివాస్ కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాస రావు గురించి అందరికీ పరిచయమే.

మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నారు.

ఈయన ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తున్నారు.ఈయన సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు నాటకాలు వేసేవాడు.ఇక ఇండస్ట్రీలో అడుగు పెట్టాక తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.1970లలో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కోట శ్రీనివాసరావు దాదాపు 250 సినిమాలకు పైగా నటించారు.ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

తండ్రి, తాత, మామయ్య వంటి పలు సహాయ పాత్రలలో నటించారు.అంతేకాకుండా నెగటివ్ పాత్రలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు.ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా నిలిచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఆయన దర్శకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే.

Advertisement

ఈయన దర్శకత్వంలో ఏ సినిమా అయినా హిట్ కాకుండా ఉండదు.ఈయన దర్శకత్వంలో వచ్చే సినిమాలు అన్ని ఎమోషనల్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ లో ఉంటాయి.

పైగా చాలా వరకు స్టార్ హీరోలకే అవకాశం ఇస్తూ ఉంటాడు.ఈయన మాటల మాంత్రికుడు అనే పేరు కూడా సంపాదించుకున్నాడు త్రివిక్రమ్.

ఇదిలా ఉంటే ఈయన గురించి తాజాగా కోట శ్రీనివాస్ రావు కొన్ని కామెంట్స్ చేశారు.ప్రస్తుతం ఆ కామెంట్ లు కూడా వైరల్ గా మారాయి.తాజాగా కోట శ్రీనివాస్ రావు ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని త్రివిక్రమ్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.

తనకు దర్శకుల్లో త్రివిక్రమ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు.ఆత్రేయ, జంధ్యాల లాగా డైలాగ్స్ రాయగల సమర్ధుడు త్రివిక్రమ్ అని తెలిపారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ ఏమి అన్నట్లుగా అసలు ఉండదని నిజానికి భాష పలికినట్లుగా కూడా ఉండదని కానీ అందులోనే మంచి అర్థం ఉండే మాటలు ఉంటాయని అదే ఆయనలోని ప్రత్యేకత అంటూ తెలిపారు.త్రివిక్రమ్ బాగా చదువుకున్న సంస్కారవంతుడని ఆయన రాసే విధానంలో పద్ధతి అనేది ఉంటుందని తెలిపారు.ఇక తన దర్శకత్వంలో అత్తారింటికి దారేది సినిమాలో చిన్న పాత్రల్లో నటించానని తెలిపారు.

Advertisement

ఇక తనకు ఆ సినిమా మేనేజర్ వచ్చి పెద్ద పాత్ర కాకపోయినా ప్రాధాన్యత ఉండే పాత్ర అని అన్నాడట.ఇక మేకప్ మాన్ వచ్చి ఆ పాత్ర కోసం తలపాగా చుట్టాడని అది తనకు భలే గమ్మత్తుగా అనిపించిందని తెలిపారు.త్రివిక్రమ్ కూడా చూసి బాగుందని అన్నాడట.

ఇక సినిమాలోని డైలాగ్ పేపర్ ఇచ్చినప్పుడు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదని కానీ డైలాగ్ మొత్తం చెప్పానని తెలిపారు.ఆ సమయంలో త్రివిక్రమ్ తనతో మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ డైలాగ్ రాసానండి అంటూ అంతేకాకుండా మీరైతే చెప్పగలుగుతారని అన్నాడట.

అందుకు ఆ రోజును జీవితంలో మర్చిపోను అంటూ తెలిపారు కోట శ్రీనివాసరావు.

తాజా వార్తలు