Punjabi University Convocation: చీఫ్ గెస్ట్‌గా భారత సంతతి మహిళా శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు పలు రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

వీరిలో పురుషులతో పాటు మహిళలు కూడా తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, బ్రిటన్ హోం సెక్రటరీ ప్రీతి పటేల్, ఇంద్రా నూయి, గీతా గోపినాథ్ వంటి మహిళలు తమ తమ రంగాల్లో దూసుకెళ్తున్నారు.వీరిలో భారత సంతతికి చెందిన బ్రిటీష్ పౌరురాలు గగన్‌దీప్ కాంగ్ కూడా ఒకరు.

రాయల్ సొసైటీలో తొలి భారత సంతతి మహిళా శాస్త్రవేత్తగా ఆమె చరిత్ర సృష్టించారు.ఈ క్రమంలో డిసెంబర్ 9న జరగనున్న పంజాబీ యూనివర్సిటీ 39వ స్నాతకోత్సవానికి గగన్‌దీప్‌ కాంగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.1660 నుంచి పనిచేస్తున్న రాయల్ సొసైటీ ప్రపంచంలోని ప్రసిద్ధ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించిన పురాతన శాస్త్రీయ అకాడమీ.ఐజాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్, ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్, భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ వంటి ప్రఖ్యాత సైంటిస్టులు ఇక్కడ పనిచేసిన వారే.

వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ)లో పనిచేస్తున్న గగన్‌దీప్ కాంగ్.2019లో 51 మంది శాస్త్రవేత్తల జాబితాలో ఫెలోగా ఎంపికయ్యారు.రాయల్ సొసైటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం గగన్‌దీప్.

Advertisement

భారత్‌లోని ప్రముఖ వైద్య శాస్త్రవేత్తల్లో ఒకరు.పిల్లలలో ఎంటర్టిక్ ఇన్ఫెక్షన్ల అభివృద్ధి, నివారణపై ఆమె పరిశోధనలు చేస్తున్నారు.

అంతేకాకుండా జాతీయ రోటవైరస్, టైఫాయిడ్ నిఘా నెట్‌వర్క్‌లను గగన్‌దీప్ నిర్మించారు.రెండు భారతీయ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్‌ల ఫేజ్ 1,2,3 క్లినికల్ ట్రయల్స్‌ను ఆమె నిర్వహించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో దాదాపు 400కు పైగా పరిశోధనా పత్రాలను గగన్‌దీప్ కాంగ్ ప్రచురించారు.కాగా.

ఆరున్నత సంవత్సరాల విరామం తర్వాత పంజాబీ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ అధ్యక్షత వహిస్తారు.చివరికి జూలై 2015లో వర్సిటీ స్నాతకోత్సవం జరిగింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు