జక్కన్న ఇది నిజమేనా..? RRR ‘నాటు నాటు’ సాంగ్ మొత్తం కాపీయేనంట.. 

దర్శక ధీరుడు రాజమౌలి ‘బాహుబలి’ తర్వాత ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇందులో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

మూడేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఉంది ఈ మూవీకి.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘బాహుబలి’ వంటి బ్లాక్ బస్టర్‌ను రెండు పార్టులుగా తెరకెక్కించి రూ.వేల కోట్ల కలెక్షన్లు రాబట్టారు రాజమౌళి.ఆ తర్వాత వస్తున్న RRR మూవీ కోసం దేశం మొత్తం ఆశగా ఎదరు చూస్తోంది.

ప్రమోషన్ వర్క్స్ కూడా అదిరిపోయే రేంజ్‌లో సాగుతున్నాయి.నెలలో ఒకటి లేదా రెండు సార్లు ఆర్ఆర్ఆర్ అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల అటెన్షన్ తప్పకుండా ట్రిక్స్ ప్లే చేస్తోంది ఆర్ఆర్ఆర్ మూవీ టీం.ఇకపోతే మొన్న రిలీజైన ‘నాటు నాటు’ సాంగ్ మీద విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి.ఈ సాంగ్ మొత్తం కాపీయే అని జక్కన్న పరువుతీసి పడేస్తున్నారు నెటిజన్లు.

ఆఫ్రికన్ మూవీలోకి సాంగ్, కొరియోగ్రఫీని మక్కీ టూ మక్కీ కాపీ చేశారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొందరు జక్కన్నకు సపోర్టు చేస్తుంటే మరికొందరు ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు.

Advertisement

ఒరిజినల్ ఆఫ్రికన్ సాంగ్‌లో కూడా ఇద్దరు నటులు సేమ్ కాస్ట్యూమ్స్ వేసుకుని కొంచెం గ్యాప్ ఇవ్వకుండా చాలా ఫాస్ట్‌గా డ్యాన్స్ వేస్తుంటారు.ఆ మూవీకి చెందని సాంగ్ క్లిప్పింగ్స్ పోస్టు చేసి మరీ రాజమౌళి ఓ పెద్ద కాపీ మాస్టర్ అంటూ ట్రోల్స్ చేసేస్తున్నారు.

రాజమౌళి గతంలోనూ ఇలానే చాలా సీన్లు కాపీ చేశారని కామెంట్స్ చేస్తు్న్నారు కొందరు నెటిజన్లు.ఆయన దర్శకత్వంలో నేచురల్ స్టార్ ‘నాని’ హీరోగా తెరకెక్కిన ‘ఈగ’ మూవీ కూడా ‘కాక్రోచ్’ అనే సినిమాకు కాపీ అంటూ గుర్తుచేస్తున్నారు.ఇక పాన్ ఇండియాను షేక్ చేసిన ‘బాహుబలి’ మూవీ పోస్టర్ కూడా ఓ హాలీవుడ్ మూవీ పోస్టర్‌కు కాపీ అంటూ ఆటాడుకుంటున్నారు.

ఏదేమైనా ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.విజువల్ వర్క్స్ జరుగుతున్నట్టు్ తెలుస్తోంది.ఎలాగోలా ఈ ఇయర్ కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంత్రి బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటుందని అటు మెగాఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఒకవేళ ఈ సినిమాలో కాపీ సన్నివేశాలు ఉన్నా మూవీ మాత్రం బంపర్ హిట్ అవుతుందని కామెంట్స్ చేసేవారూ లేకపోలేదు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు