వింట‌ర్‌లో డ్రై స్కిన్ వారు అస్స‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా?

వింట‌ర్ సీజ‌న్ ప్రారంభం అయింది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్య స‌మ‌స్య‌లే కాదు.

చ‌ర్మ సంబంధిత‌ స‌మ‌స్య‌లూ ఎక్కువ‌గానే ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

ముఖ్యంగా పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ ఎదుర్కొనే స‌మ‌స్య చ‌ర్మం పొడి బార‌డం.

అందులోనూ డ్రై స్విన్‌ను కలిగి ఉండే వాళ్లకు ఈ స‌మ‌స్య రెండింతలు ఎక్కువ‌గా ఉంటుంది.అందుకే పొడి చ‌ర్మ త‌త్వం క‌ల‌వారు చ‌లి కాలంలో ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ప‌నుల‌కు దూరంగా ఉండాలి.

మ‌రి లేట్ చేయ‌కుండా అవేంటో చూసేయండి.సాధార‌ణంగా చ‌లి కాలం అంటే దాదాపు అంద‌రూ వేడి వేడి నీటితోనే స్నానం చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు.

Advertisement

కానీ, ఎవ‌రైతే పొడి చ‌ర్మ త‌త్వం క‌లిగి ఉన్నారో.వారు వేడి నీటితో బాత్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.

ఎందుకంటే, వేడి నీటి స్నానం వ‌ల్ల చ‌ర్మం ఇంకా పొడిగా మారిపోయి దుర‌ద‌ల‌కు దారి తీస్తుంది.అందుకే చ‌న్నీటి స్నానం లేదా గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి.

అలాగే డ్రై స్కిన్ క‌ల‌వారు ఆల్కహాల్‌ ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఆల్క‌హాల్‌ను క‌లిగి ఉండే ఉత్ప‌త్తుల‌ను వింట‌ర్‌లో యూజ్ చేస్తే.చ‌ర్మం మ‌రింత పొడిబారే అవకాశం అత్య‌ధికంగా ఉంటుంది.

కొంద‌రు వింట‌ర్‌లో వాట‌ర్ తాగ‌డం త‌గ్గించేస్తారు.కానీ, పొడి చ‌ర్మ త‌త్వం క‌ల‌వారు వాట‌ర్‌ను నిర్ల‌క్ష్యం చేస్తే శ‌రీరం డీహైడ్రేట్ అయిపోయి చ‌ర్మం పొడిబారిపోతుంది.దాంతో బిరుసెక్కి చిట్లుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అందుకే డ్రై స్కిన్ క‌ల‌వారు వింట‌ర్‌లో రోజుకు క‌నీసం ప‌ది గ్లాసుల నీటినైనా సేవించాలి.ఇక వింట‌ర్ సీజ‌న్‌లో పొడి చ‌ర్మం కల‌వారు.

Advertisement

త‌ర‌చూ స్కీన్‌ బ్లీచింగ్ చేయించుకోరాదు.మాయిశ్చరైజర్లు ఎట్టి ప‌రిస్థితుల్లో ఎవైడ్ చేయ‌రాదు.క‌ఠిన‌మైన స‌బ్బుల‌కు దూరంగా ఉండాలి.

మ‌రియు ప్ర‌తి రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వేసి స్నానం చేయాలి.త‌ద్వారా చ‌ర్మం తేమ‌గా ఉంటుంది.

తాజా వార్తలు