బ్యాచిలర్ కు సెకండ్‌ వీక్‌ ఆశించింది దక్కలేదట

అఖిల్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాకు వసూళ్లు మొదటి వారంలో దాదాపుగా 40 కోట్ల రూపాయలు నమోదు అయ్యాయి.

అందులో 26 కోట్ల వరకు షేర్‌ ఉంది.

మొత్తంగా అఖిల్ బ్యాచిలర్ సినిమా రెండవ వారం కూడా కలుపుకుని 50 కోట్ల వరకు రాబట్టి 30 కోట్ల షేర్‌ ను నమోదు చేస్తుంది అంటూ అంతా భావించారు.కాని అనూహ్యంగా మరో కోటి కూడా షేర్‌ ను రాబట్టలేక బ్యాచిలర్ సినిమా చతిగిల పడింది.

అనూహ్యంగా బ్యాచిలర్‌ సినిమాకు రెండవ వారంలో వసూళ్లు పూర్తిగా డ్రాప్‌ అయ్యాయి.రెండవ వారంలో ఈ సినిమాకు పోటీ అన్నట్లుగా పెద్ద సినిమా లు ఏమీ రాలేదు.నాట్యం వచ్చినా కూడా జనాలు ఆ సినిమాను పట్టించుకోలేదు.

అయినా కూడా బ్యాచిలర్ ను చూసిన వారే లేరు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాకు సంబంధించినంత వరకు ఈ సినిమా వసూళ్లు 50 కోట్ల వరకు ఉంటాయి అంటూ అంతా భావించారు.

Advertisement

కాని అనూహ్యంగా ప్లాన్ రివర్స్ అయ్యింది.సినిమా కాస్త బాక్సాఫీస్‌ వద్ద రెండవ వారం ప్రభావం చూపించలేదు.

ఈమద్య కాలంలో సినిమాలు రెండవ వారంలో వసూళ్లు దక్కించుకోవడం అంటే చాలా పెద్ద విషయంగా మారింది.అఖిల్‌ సినిమా ఖచ్చితంగా ఓటీటీ లో రాదు అంటూ ఇప్పటికే ప్రకటన చేసినా కూడా ప్రేక్షకులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

మొదటి వారంలో వచ్చిన వసూళ్లు మాత్రమే బాక్సాఫీస్ వద్ద వసూళ్లుగా నిలిచాయి.అంతకు మించి రాబట్టలేక పోయాయి.లాంగ్‌ రన్‌ లో ఈ సినిమా మొత్తంగా రూ.43 కోట్లు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రాణిస్తున్న సినిమా లు ఏమీ లేవు.

బ్యాచిలర్ ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు.ఈ వారంలో విడుదల కాబోతున్న సినిమాలు చాలానే ఉన్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మరి ఏది పై చేయి సాధిస్తుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు