న్యూస్ రౌండప్ టాప్ 20

1.దిశ జుడిషియల్ కమిషన్ దర్యాప్తు వేగం

దిశ జుడిషియల్ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేసింది.

కమిషన్ ముందు సోమవారం శంషాబాద్ డిసీపీ, లారీ ఓనర్ శ్రీనివాస్ హాజరయ్యారు. 

2.నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహిస్తున్న కేటీఆర్

  తెలంగాణ భవన్  మంత్రి కేటీఆర్ ప్లీనరీ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ముందుగానే టిఆర్ఎస్ కు చెందిన కీలక నేతలతో నియోజకవర్గాల వారీగా ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. 

3.కేటీఆర్ పై రేవంత్ విమర్శలు

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ కలాన్ లో ఉన్న జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై టీ పిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కేటీఆర్ పై విమర్శలు చేశారు.   

4.ఢిల్లీ కి బండి సంజయ్

  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేటి సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. 

5.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 28, 231 మంది భక్తులు దర్శించుకున్నారు. 

6.ఎన్ ఎస్ జీ ర్యాలీని ప్రారంభించిన గవర్నర్

  ఆజాధీకా అమృతోశ్చవ్ లో భాగంగా సుదర్శన్ భారత పరిక్రమ పేరిట నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ( ఎన్.ఎస్.జి ) ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త బ్లాక్ క్యాట్ కారు ర్యాలీ హైదరాబాద్ కు చేరుకుంది.ఇక్కడి నుంచి చెన్నై కి వెళ్లనున్న ఈ ర్యాలీని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పీపుల్స్ ప్లాజా వద్ద జెండా ఊపి ప్రారంభించారు. 

7.సచ్చిదానంద స్వామి ఆశ్రమం కి జగన్

Advertisement

  విజయవాడ పడమట లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం కి ఏపీ సీఎం జగన్ వెళ్లారు. 

8.ద్వారకా తిరుమల లో అశ్వయుజ మాస బ్రహ్మొత్సవాలు

  ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 

9.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

10.  మా ఎన్నికలపై బాబు మోహన్ స్పందన

  మా లోని ప్రతి సభ్యడికి విష్ణునే అధ్యక్షుడు అని, ఇంకో రెండేళ్లు విష్ణు అధ్యక్షుడిగా గెలుస్తారని బాబు మోహన్ వ్యాఖ్యానించారు. 

11.వారి రాజీనామాలు అందలేదు : మా అధ్యక్షుడు

  ప్రకాష్ రాజు ఫైనల్ రాజీనామా లేఖ తనకు అందలేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. 

12.19 న సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

  మీలాద్ ఉన్ - నబీ పండుగ సెలవుని అక్టోబర్ 20 కి బదులు, 19 కి మార్చుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

13.శ్రీవారిని దర్శించుకున్న మా అధ్యక్షుడు

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు తన టీమ్ తో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

14.భారత్ అమెరికా సైనికుల కబడ్డీ మ్యాచ్

  అమెరికాలోని అలస్కాలో భారత్ అమెరికా ఆర్మీ ల మధ్య ఆటల పోటీలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భారత్ అమెరికా సైనికుల మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది. 

15.రేపు యాదాద్రి కి కేసీఆర్

  తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ప్రముఖ పుణ్య క్షేత్రం యాదద్రికి వెళ్లనున్నారు. 

16.20 నుంచి బండి సంజయ్ ప్రచారం

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

  ఈనెల 20వ తేదీ నుంచి హుజురాబాద్ లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

17.బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు

  హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసు కున్నారు. 

18.ఆన్లైన్ లో టికెటింగ్ ను సమర్దిస్తున్నా : విష్ణు

Advertisement

  ఆన్లైన్ సినిమా టికెటింగ్ విధానాన్ని సమర్థిస్తున్నానని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. 

19.పెరగనున్న ఉల్లి ధరలు

  గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,070   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,070      .

తాజా వార్తలు