ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మాజీ స్టార్ క్రికెట‌ర్ అరెస్టు..

క్రికెట్ ఆల్ రౌండ‌ర్‌గా రాణించి ఇప్ప‌టికీ అభిమానుల గుండెల్లో గూటు క‌ట్టుకున్న యువ‌రాజ్ సింగ్ అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.

కాగా ఆయ‌న ఇప్పుడు అరెస్టు కావ‌డం దేశ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం రేపుతోంది.

ఆయ‌న్ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేయ‌డ‌మే ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది.కాగా యువ‌రాజ్ సింగ్ రీసెంట్ గా క్రికెట లో ప్ర‌జెంట్ స్టార్ స్పిన్న‌ర్ గా దూసుకుపోతున్న యుజ్వేంద్ర చాహల్ మీద‌ చేసిన కామెంట్లు పెను దుమారం రేపిన విష‌యం అంద‌రికీ విదిత‌మే.

దీంతో అది కాస్తా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు పోలీసులు.ఈ కార‌ణంగా యువ‌రాజ్ సింగ్‌ను హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లా హన్సి పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకుని విచారించారు.

దాదాపు మూడు గంటల పాటు యువ‌రాజ్‌ను విచారించిన పోలీసులు దీని త‌ర్వాత యువ‌రాజ్ బెయిల్ మీద విడుదల కావ‌డం గ‌మ‌నార్హం.అస‌లు ఏమైందంటే పోయినేడాది ఓ మ్యాచ్ ఆడుతున్న స‌మ‌యంలో రోహిత్ శర్మతో ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ చేసిన యువరాజ్ సింగ్ ఇందులో భాగంగా షెడ్యూల్ కులాన్ని అగౌర‌వ ప‌రిచేలా చేసిన కామెంట్లు పెద్ద దుమారం రేపాయి.

Advertisement

అప్పుడు లాక్ డౌన్ టైమ్‌లో స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహల్ త‌న ఇంట్లో ఫ్రీగా గడుపుతున్నాడని అత‌నికి టైమ్ పాస్ చేయ‌డం త‌ప్ప మ‌రేదీ తెలియ‌దంటూ ఫ‌న్నీగా కామెంట్లు చేశాడు.అయితే ఈ క్ర‌మంలో అత‌ను ఓ కులానికి చెందిన వారిలాగా ఫ్రీగా ఉంటున్నాడ‌ని, ప‌నీ పాట లేకుండా గ‌డుపుతున్నాడంటూ చేసిన వ్యాఖ్య‌లపై ఓ న్యాయవాది పిటిష‌న్ వేయ‌గా దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి యువరాజ్ సింగ్ ను అరెస్టు చేశారు.కాగా వబెయిల్ మీద విడుద‌లైన యువ‌రాజ్ సింగ్ అరెస్టుపై స్పందించాడు.

తాను కేవ‌లం స‌ర‌దాగా ఆ కామెంట్లు చేశాన‌ని, ఉద్దేశపూర్వకంగా చేయ‌ల‌దేంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు