న్యూస్ రౌండప్ టాప్ 20

1.సాయి ధరమ్ తేజ్ పై చిరంజీవి ట్వీట్

నటుడు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

 

2.బండ్ల గణేష్ వ్యాఖ్యలు

  కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనాలని మాజీ ఎంపీ మల్లు రవి సినీ నిర్మాత బండ్ల గణేష్ ని కోరగా,  రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను యాక్టివ్ గా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

3.తూర్పుగోదావరి జిల్లాలో విగ్రహాల ధ్వంసం

  ఆంధ్రప్రదేశ్లో మళ్లీ విగ్రహాల ధ్వంసం ఘటన కలకలం రేపుతోంది.దసరా పండుగ నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియని విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు.తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు లో చెరువుగట్టు పై గల దుర్గాదేవి ఆలయంలో కొందరు దుండగులు విగ్రహాలను ధ్వంసం చేశారు. 

4.రాజరాజేశ్వరి దేవి గా బెజవాడ దుర్గమ్మ

  ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తొమ్మిదో రోజు విజయదశమి సందర్భంగా శుక్రవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. 

5.ద్వారకా తిరుమలలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

  పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల వెంకన్న ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు అశ్వయుజ మాస బ్రహ్మొత్సవాలు జరగనున్నాయి. 

6.హెటిరో లో దొరికిన సొమ్ము జగన్ దే : టీడీపీ

  తెలంగాణలోని హెటిరో డ్రగ్స్ సంస్థలో ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో దొరికిన సుమంత ఏపీ సీఎం జగన్ దే అంటూ టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 

7.భారత్ లో కరోనా

Advertisement

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

8.మైసూర్ ప్యాలెస్ లో ప్రజలకు ప్రవేశం లేదు

  కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో మైసూర్ జంబూ సవారీ కోసం అంబావిలాస్ ప్లేస్ లోకి ప్రవేశాన్ని మైసూర్ జిల్లా యంత్రాంగం నిషేధించింది. 

9.ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ సర్వేల పై నిషేధం విధించినట్లు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. 

10.రైతు పక్షపాతిగా జగన్ కేసీఆర్

  ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ రైతు పక్షపాతిగా అనేక సందర్భాల్లో రుజువైందని ప్రముఖ దర్శకుడు నటుడు ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. 

11.మావోయిస్టు ఆర్కే మృతిపై భార్య స్పందన

  మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతిపై మావోయిస్టుల నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని ఆయన శిరీష తెలిపారు. 

12.జెర్సీ డైరెక్టర్ తో రామ్ చరణ్ కొత్త చిత్రం

  జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.యువి క్రియేషన్స్, ఎం.వి.ఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

13.ఉత్తరాంధ్ర కు భారీ వర్ష సూచన

  ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

14.కాబూల్ కు విమాన సర్వీసులు నిలిపివేసిన పాక్

  తాలిబన్ల మితిమీరిన జోక్యం కారణంగా ఆఫ్గాన్ రాజధాని కాబూల్ కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. 

15.సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

  ఇప్పటివరకు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే జరిగే ఆస్తి రిజిస్ట్రేషన్లను ఇకపై గ్రామ, వార్డు సచివాలయం లో కూడా చేసేందుకు ఏపీ సీఎం జగన్ ముమ్మర ఏర్పాట్లు చేయిస్తున్నారు. 

16.భక్తులకు టీటీడీ శుభవార్త

తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం కానుంది.త్వరలో సర్వ దర్శనం టోకెన్లను అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. 

17.దేవరగట్టు కర్రల సమరం : భారీ బందోబస్తు

Advertisement

  విజయదశమి సందర్భంగా కర్నూలు జిల్లాలోని హులగుంద మండలం లోని దేవరగట్టు మల్లేశ్వర స్వామి దసరా బన్నీ జైత్రయాత్ర ఉత్సవం ఈరోజు జరగనుంది.దీనికోసం భారీ పోలీసు బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. 

18.నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

  నేటితో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 

19.మా ఎన్నికల పై కోర్టుకు ప్రకాష్ రాజ్

  మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి చెందిన ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికలపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.సోమవారం దీనిపై పిటిషన్ వేయనున్నారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,980   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,980.

తాజా వార్తలు