మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు మెగా కుటుంబానికి చెందిన కొంతమంది హీరోలకు ఆగ్రహం తెప్పించాయి.
ఎన్నికల వల్ల పైకి చెప్పకపోయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో చీలిక ఏర్పడిందని చాలామంది భావిస్తున్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వల్ల ఏ నటులు ఏ కాంపౌండ్ అనే విషయం గురించి సైతం క్లారిటీ వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇకపై మెగాహీరోల సినిమాలలో కొంతమంది నటులకు అవకాశాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది,
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకుముందు తాను కృష్ణుని పాత్రను పోషిస్తానని సీనియర్ నరేష్ చెప్పుకొచ్చారు.అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ కు చెందిన సభ్యులు మాత్రం సీనియర్ నరేష్ కృష్ణుడు కాదని అతను శకుని అని కామెంట్లు చేశారు.గత కొన్నిరోజులుగా ప్రకాష్ రాజ్, నాగబాబు ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటూ ఉండటం ఒకరి కౌంటర్లకు మరొకరు కౌంటర్లు ఇవ్వడం చూశాం.
తాజాగా నరేష్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల గురించి ముండమోపి అని కామెంట్లు చేసిన నేపథ్యంలో ఇకపై సీనియర్ నరేష్ కు మెగా హీరోల సినిమాలలో అవకాశాలు దక్కకపోవచ్చని తెలుస్తోంది.మంచు విష్ణు ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులకు సైతం మెగా కాంపౌండ్ సినిమాలలో అవకాశాలు రావడం కష్టమేనని సమాచారం.
అయితే అదే సమయంలో మోహన్ బాబు వర్గం ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ కలిసి ఒకే సినిమాలో నటించడం కూడా కష్టమేనని సమాచారం.పైకి చెప్పకపోయినా టాలీవుడ్ లో విభజన రేఖ వచ్చేసిందని తెలుస్తోంది.మోహన్ బాబు కు మద్దతుగా నిలిచే హీరోలు సైతం ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు అవకాశాలు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల రచ్చ ఎప్పటికి ఆగుతుందో చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy