ఆర్ధిక సంక్షోభంలో అమెరికా...బిడెన్ ఈ సాహసం చేయక తప్పదేమో...!!!

అగ్ర రాజ్యం అమెరికా ఖజానా ఖాళీ అవుతోంది.చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితుల నేపధ్యంలో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.

ఒక పక్క ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు విపరీతంగా తగ్గుడంతో ఖాజానా నిండుకుంది.కరోనా ధాటిని తట్టుకోలోని అగ్ర రాజ్యం ఇప్పుడు బావురుమంటోంది.

ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఫెడరల్ ఉద్యోగుల జీతాలు చెల్లించే పరిస్థితులు కూడా కనపడటం లేదట.అయితే ఈ పరిస్థితుల నుంచీ గట్టేక్కేందుకు బిడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.మునుపెన్నడూ లేని విధంగా రూ.75 లక్షల కోట్ల విలువ గల ప్లాటినమ్ నాణాన్ని ముద్రించాలని నిర్ణయించారు.కోట్లు విలువగల ప్లాటినమ్ నాణాన్ని ముద్రించి ఆ నాణం ద్వారా ట్రెజరీ నుంచీ అప్పు తీసుకువాలని నిర్ణయించారు.ఇందుకు బిడెన్ ప్రభుత్వం కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నాణం ద్వారా ట్రెజరీ నుంచీ అప్పు తెచ్చుకునే విధానాన్ని 2001 లోనే చట్టంగా చేశారు.విపత్కర పరిస్థితులు ఎదురయినప్పుడు ఈ విధానాన్ని అనుసరించే విధంగా చట్టం చేయడంతో ఇప్పుడు బిడెన్ సర్కార్ కు వరంగా మారింది.

Advertisement

ఇక్కడ మరొక విషయం ఏమిటంటే చట్ట సభలో మద్దతు లేకపోయినా బిడెన్ తన విశిష్ట అధికారాలు ఉపయోగించి నాణాన్ని ముద్రించేలా ఆదేశాలు జారీ చేయవచ్చు.

2011 లో ఒబామా అధికారంలో ఉన్న సమయంలో కూడా నగదు ఖాజానా ఖాళీ అయ్యే పరిస్థితులు ఏర్పడిన సమయంలో కూడా ఈ నాణం అంశం తెరమీదకు వచ్చింది.అప్పట్లో ఒబామా ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారని పరిశీలకులు అంటున్నారు ఇదిలాఉంటే అమెరికా ట్రెజరీ సెక్రెటరీ జాన్ ఎల్లన్ నాణం ముద్రపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.మన ఖజానా నష్టాన్ని పూడ్చుకోవడానికి అదనంగా డబ్బులు ముద్రించడం సరికాదని సూచించారు.

అమెరికా వద్ద డబ్బులు లేవని అప్పు తెచ్చుకుంటున్న విషయం ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు