అప్పుడు కోటి, రమణ గోగుల ఇప్పుడు థమన్ కి అరుదైన అవకాశం

పవన్ కల్యాణ్.తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరో.

లక్షలాది మంది అభిమానులున్న నటుడు.

విజయం, పరాజయంతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న యాక్టర్.

తన చక్కటి మేనరిజంతో అలరిస్తున్న పవన్ కల్యాణ్.తనతో కనెక్ట్ అయిన వారి కోసం ఏమైనా చేస్తాడు.ఎంతకైనా తెగిస్తాడు.

తన సినిమాల్లో మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తాడు.ఇంతకీ తను మళ్లీ మళ్లీ అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ కొంత మంది ఉన్నారు.

Advertisement

ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించి చాలా వరకు మ్యూజికల్ హిట్స్ ఉంటాయి.

పవన్ కల్యాణ్ సినిమాలకు చాలా మంది సంగీత దర్శకులు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.వారిలో ఎస్.ఎ.రాజ్ కుమార్, దేవా, విద్యాసాగ‌ర్, ఎ.ఆర్.రెహ‌మాన్, యువ‌న్ శంక‌ర్ రాజా, అనిరుధ్ సహా పలువురు అన్నారు.అయితే వీరిలో ర‌మ‌ణ గోగుల, మ‌ణిశ‌ర్మ‌, దేవి శ్రీ ప్ర‌సాద్, అనూప్ రూబెన్స్ తనతో బాగా కనెక్ట్ అయ్యారు.

అందుకే వీరితో రెండు, అంతకంటే ఎక్కువ సినిమాలు చేశారు.ప్రస్తుతం ఈ లిస్టులో చేరాడు తమన్. వకీల్ సాబ్ సినిమాకు సంగీతం అందించిన ఆయన.ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాకు కూడా అవకాశం ఇచ్చాడు.మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం దక్కింది తమన్ కు.

వాస్తవానికి తమన్ కంటే ముందు మరో ఇద్దరు సంగీత దర్శకులు పవన్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు.వారు మరెవరో కాదు. కోటి, రమణ గోగోల.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

పవన్ కల్యాణ్ తొలి సినిమా అక్క‌డ అమ్మాయి - ఇక్క‌డ అబ్బాయికి బాణీలు అందించాడు కోటి.ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత‌ సినిమాకు కా ఈయనే సంగీతం ఇచ్చాడు.

Advertisement

ఆ తర్వాత తమ్ముడు సినిమాకు రమణ గోగుల పని చేశాడు.ఆ తర్వాతే వచ్చిన బద్రి సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చాడు.

మొత్తంగా అప్పుడు కోటి, రమణ గోగుల వెంట వెంటనే సినిమాలు చేయగా.ప్రస్తుతం ఆ కోవలో చేరాడు తమన్.

తాజా వార్తలు