కోర్టు ముందు బోరుమన్న ట్రంప్...తాలిబన్ల పాటి స్వేఛ్చ కూడా నాకు లేదా...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ పిచ్చి బాగా పట్టేసింది.

సోషల్ మీడియా లో తన వాణి వినిపించే ఏకైక మాధ్యమం ట్విట్టర్ తనను కాదని పొమ్మన్న తరువాత మొదలు ట్రంప్ కు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురయ్యింది.

అధ్యక్ష ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని తన మద్దతు దారులను రెచ్చగొట్టిన కారణంగా క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన విషయం విధితమే.ఈ క్రమంలోనే సోషల్ మీడియా మాధ్యమాలు అన్నీ ట్రంప్ ఖాతాలపై జీవిత కాల నిషేధం విధించాయి.

ఈ నేపద్యంలో ట్రంప్ సొంతగా సోషల్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటానని ప్రకటించినా అది సక్సస్ కాలేదు దాంతో దిక్కుతోచని మళ్ళీ తన ట్విట్టర్ ఖాతా తనకు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బిడెన్ ను రాజకీయంగా ఎడుర్కుంటున్నా, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా సరే ఏ మాత్రం తనకు మీడియా కవరేజ్ ఉండటం లేదని ఈ సమయంలో తనకు సోషల్ మీడియా మాధ్యమం అవసరమని వాపోతున్నారు ట్రంప్.

ఇక చేసేది లేక అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఫెడరల్ కోర్టులో తన ట్విట్టర్ ఖాతా తనకు ఇప్పించాలంటూ పిటిషన్ వేశారు.తాత్కాలికంగా అయినా సరే తన ఖాతాను తనకు ఇప్పించాలని కోరారు.

Advertisement

ట్విట్టర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తన ఖాతా తనకు ఇప్పించాలని కోరారు.గతంలో కూడా తనపై సోషల్ మీడియా విధించిన బ్యాన్ పై కోర్టుకెక్కిన ట్రంప్ విఫలం చెందగా తాజాగా మరోసారి తన ఖాతా విషయంపై కోర్టును ఆశ్రయించారు.తాలిబన్ల ఖాతాలపై నిషేధం విధించని ట్విట్టర్ తన ఖాతాపై మాత్రం బ్యాన్ విధించిందని, తాను ఓ మాజీ అమెరికా అధ్యక్షుడనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా కోర్టును కోరారు ట్రంప్.

ఇదిలాఉంటే ట్విట్టర్ సంస్థ మాత్రం ఈ విషయంపై ఏ విధంగా కూడా స్పందించక పోవడంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఉత్ఖంట నెలకొంది.

Advertisement

తాజా వార్తలు