ద్రాక్ష పండ్ల‌తో ఆయిలీ స్కిన్‌ను వ‌దిలించుకోవ‌చ్చ‌ట‌..ఎలాగంటే?

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ఆయిలీ స్కిన్ ఒకటి.

ఆయిలీ స్కిన్ వ‌ల్ల చ‌ర్మం ఎప్పుడూ అందవిహీనంగా క‌నిపిస్తుంది.

పైగా జిడ్డు చ‌ర్మ త‌త్వం ఉన్న వారికి మొటిమ‌ల స‌మ‌స్య కూడా అధికంగా ఉంటుంది.అందుకే ఈ స‌మ‌స్య త‌గ్గించుకునేందుకు అవీ, ఇవీ అంటూ ర‌క‌ర‌కాల ప్రోడెక్ట్స్‌ను వాడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ టిప్స్ పాటిస్తే.చాలా సుల‌భంగా ఆయిలీ స్కిన్‌ను వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.ముందుగా ఒక క‌ప్పు సీడ్ లెస్ ద్రాక్ష పండ్ల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఒక ఎగ్ వైట్‌, రెండు స్పూన్ల నిమ్మ ర‌సం, ఒక స్పూన్ తేనె యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.

ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై అదన‌పు జిడ్డు తొలిగిపోయి చ‌ర్మం ఫ్రెష్‌గా, గ్లోగా మారుతుంది.పైగా త‌ర‌చూ ఈ ప్యాక్‌ను యూజ్ చేస్తే ఆయిలీ స్కిన్ స‌మ‌స్య క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

అలాగే ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ఓట్స్ పౌడ‌ర్‌, ఒక స్పూన్ బాదం పౌడ‌ర్‌, రెండు స్పూన్ల‌ రోజ్ వాట‌ర్‌, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి లైట్‌గా ఆరిన త‌ర్వాత స్క్ర‌బ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే జిడ్డు చ‌ర్మం స‌మ‌స్య త‌గ్గుతుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

మ‌రియు ముఖ ఛాయ పెరుగుతుంది.ఇక ఈ టిప్స్‌తో పాటుగా ఆయిలీ స్కిన్ వారు రోజుకు ఖ‌చ్చితంగా మూడు లేదా నాలుగు సార్లు గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

Advertisement

ఒత్తిడిని నివారించుకోవాలి.డైట్‌లో నూనె ఆహారాలు లేకుండా చూసుకోవాలి.

వాట‌ర్ ఎక్కువ‌గా సేవించాలి.మ‌రియు చ‌ర్మానికి ఉప‌యోగించే స‌బ్బులు మ‌రియు ఇత‌ర ఉత్ప‌త్తుల‌న్నీ ఆయిల్ ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి.

తాజా వార్తలు