హుజురాబాద్‌లో ఈటల‌కు ఝలక్.. ఇలా జరిగింది ఏంటి

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ విదితమే.ఈ బై పోల్‌కు ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది.ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.తాజాగా రాజేందర్‌కు నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది.

నియోజకవర్గంలోని పాపయ్యపల్లిలో ప్రవీణ్ యాదవ్ అనే వ్యక్తి కొద్దిరోజుల కిందట చనిపోయాడు.

Advertisement

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు అక్కడకు మాజీ మంత్రి ఈటల వెళ్లగా, మృతుడి కుటుంబ సభ్యులు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు.ఈటలను చూడగానే మృతుడి కుటుంబీకులు తిట్ల దండకం మొదలుపెట్టారు.ఈటల రాజేందర్ వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపించారు.

మృతుడి కుటుంబీకులు తనను దూషించడం చూసి మాజీ మంత్రి షాక్ అయ్యారు.పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ పరిణామం కాస్తా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే, హుజురాబాద్‌లో ఈటల గెలుపు ఖాయమని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న గెల్లు శ్రీనవాస్ యాదవ్ సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ప్రచారంలో బిజీగా ఉన్నారు.గెల్లు తరఫున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇకపోతే ఇప్పటి వరకు హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండబోయే అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తేలలేదు.కాగా ఇప్పుడు ఈట‌ల కూడా దీనిపై స్పందించ‌క‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్షాలు దీన్ని అస్త్రంగా వాడుకునే అవ‌కాశం కూడా ఉంది.

Advertisement

మ‌రీ ముఖ్యంగా టీఆర్ కార్య‌క‌ర్త‌ల‌ను ఇప్ప‌టికే దీన్ని సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ చేస్తున్నారు.

తాజా వార్తలు