పాకిస్తాన్ మాజీ కెప్టెన్ కు గుండె పోటు..!

తాజగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజీమాముల్ హక్ గుండెపోటుతో లాహోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు.

గత మూడు రోజులుగా ఆయనకు ఛాతిలో నొప్పి ఎక్కువ కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు.

సోమవారంనాడు ఆయనకు చాతి నొప్పి మరి తీవ్రతరం కావడంతో ఆయనకు వైద్యులు గుండెపోటు సంభవించినట్లు నిర్ధారించారు.దీంతో ఆయనకు గుండె సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలోనే ఇంజీమాముల్ హక్ కు యాంజియోప్లాస్టి నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలియజేశారు.శస్త్రచికిత్స తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు.ఇకపోతే ఇంజమామ్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి 1991 లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు.1992లో పాకిస్తాన్ గెలిచిన వన్డే ప్రపంచ కప్పు జట్టులో కూడా అతడు భాగస్వామి.ఆ తర్వాత పాకిస్తాన్ సాధించిన అనేక విషయాలలో తన పాత్ర వహించాడు.

అనతికాలంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ లలో ఒకటిగా ఇంజమామ్ చేరాడు.ఇక ఇంజమామ్ తన ప్రపంచ కెరియర్ లో మొత్తంగా 378 వన్డేలు ఆడగా అందులో 11739 పరుగులు చేశాడు.

Advertisement

ఇందులో పది సెంచరీలు ఉండగా70 హాఫ్ సెంచరీలు కూడా ఉండడం విశేషం.ఇక టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే.ఇంజీమాముల్ హక్ పాకిస్తాన్ తరఫున 120 టెస్టులు అడగా 8833 పరుగులు చేయగా అందులో ఇరవై ఐదు సెంచరీలు సాధించాడు.

ఇప్పటికి పాకిస్తాన్ క్రికెట్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజీమాముల్ హక్ నిలిచి ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు