గూగుల్ మీ పర్సనల్ డేటా సేకరించకుండా సెట్టింగ్స్ ఇలా మార్చుకోండి..!

ఇంటర్నెట్ లో మనం వెతికే విషయాలన్నీ గూగుల్ కి తెలుస్తుంటాయి.

అయితే గూగుల్ మీ డేటాను ట్రాక్ చేయకుండా అందుబాటులో ఉన్న కొన్ని సెట్టింగ్స్ మార్చితే సరిపోతుంది.

ఆ సెట్టింగ్స్ ఏమిటో చూద్దాం.

‘యాక్టివిటీ ట్రాకింగ్’ ఆఫ్ చేయాలి:

మీరు వెతికిన, చదివిన, చూసిన విషయాలను గూగుల్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే.అకౌంట్ సెట్టింగ్‌లలోని యాక్టివిటీ ట్రాకింగ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి.

ఆన్‌లైన్ యాక్టివిటీస్ డేటాను గూగుల్ కలెక్ట్ చేయకుండా ఉండేందుకు సెర్చ్ లేదా యూట్యూబ్ లేదా మ్యాప్స్ వంటి యాప్స్ లో ‘యాక్టివిటీ’ ట్రాకింగ్‌ను టర్న్ ఆఫ్ చేయాలి.ఇందుకు మీరు క్రోమ్ బ్రౌజర్‌లో గూగుల్ "యాక్టివిటీ ట్రాకింగ్" అని టైప్ చేసి ఎంటర్ చేయాలి.

ఆ తరువాత గూగుల్ కంట్రోల్ పేజ్ ఓపెన్ అవుతుంది.ఆ పేజీలో వెబ్&యాప్ యాక్టివిటీ, లొకేషన్ హిస్టరీ, యూట్యూబ్ హిస్టరీ గమనించవచ్చు.

Advertisement

ఈ అన్ని సెక్షన్లలోని యాక్టివిటీపై క్లిక్ చేసి.టోగుల్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

యూట్యూబ్ హిస్టరీ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ యూట్యూబ్ హిస్టరీని డిలీట్ చేసుకోవాలని.లొకేషన్ ట్రాకింగ్ సెక్షన్ లో కూడా ట్రాకింగ్ ఆప్షన్ టర్న్ ఆఫ్ చేయొచ్చు.

అలాగే వీటితోపాటు ఆడియో రికార్డింగ్‌లను డిలీట్ చేసే మీ ప్రైవసీ కాపాడుకోండి.మనం బాగా ఎంజాయ్ చేసే గూగుల్ సెర్చ్ , అసిస్టెంట్, మ్యాప్స్ లలో వాయిస్ ఉపయోగించి సెర్చ్ చేస్తుంటాం.

మనం మాట్లాడే మాటలు అన్నీ కూడా గూగుల్ స్టోర్ చేసుకుంటుంది.ఈ రికార్డింగులను డిలీట్ చేయడానికి ఆండ్రాయిడ్ ఫోన్ లోని యాప్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఆ తర్వాత గూగుల్ ని సెలెక్ట్ చేసి.డేటా & ప్రైవసీపై క్లిక్ చేసి హిస్టరీ సెట్టింగ్స్ ని ఎంచుకోవాలి.

Advertisement

ఆపై "Include audio recordings" టర్న్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

తాజా వార్తలు