స్వయం కృపరాధం అంటే ఇదేగా బాబు ? 

పోరాడాల్సిన సమయంలో కాడి కింద పడేస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో ఏపీ లో టీడీపీ పరిస్థితి చూస్తే అర్ధం అవుతుంది.

ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీకి ఊపు వస్తోంది అనుకుంటున్న సమయంలో,  ఏపీలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా వెలువడ్డాయి.

జనాల్లో వైసీపీ పై వ్యతిరేకత పెరుగుతోంది అని అంతా అనుకుంటున్న సమయంలో ఈ ఫలితాలు జగన్ పార్టీలో జోష్ నింపాయి.టీడీపీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లేలా చేశాయి.

 టిడిపి అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరిపించేందుకు చంద్రబాబు వెనకడుగు వేశారు.ఫలితాలు తేడా కొడితే 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వస్తుందేమోనన్న భయంతో ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వచ్చారు.

కానీ చివరకు బాబు ముందు నుంచి ఊహించిందే జరిగింది. ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వెలువడడంతో టిడిపిలో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల తంతు వైసీపీ మొదలుపెట్టినప్పటి నుంచి టిడిపి అస్త్రసన్యాసం చేసినట్లుగా వ్యవహరించింది.

ఎన్నికలను అడ్డుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేసింది.చివరకు ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటన చేసినా , ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.అసలు ఎన్నికల బహిష్కరణ అనే నిర్ణయాన్ని మెజార్టీ టిడిపి నాయకులు వ్యతిరేకించారు.

కష్టమో నష్టమో ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజల్లో పార్టీపై ఏ స్థాయిలో ఆదరణ ఉంటుంది అనేది ఖచ్చితంగా తేలేదని అలా కాకుండా ముందుగానే ఓటమిని అంగీకరించినట్లుగా ప్రకటన చేయడం తో ఎంతోమంది అభ్యర్థుల పైన ఆ ప్రభావం చూపించింది అనేది టిడిపి నాయకుల అభిప్రాయం.ఇక ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల ను బహిష్కరిస్తున్నట్లు గా టిడిపి ప్రకటన చేసినప్పుడు ఏ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తన పదవికి రాజీనామా చేశారు.

దాదాపు 70 లక్షల సభ్యత్వం తెలుగుదేశం పార్టీకి ఉన్నా, ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం  చారిత్రాత్మక తప్పిదమే.ఇప్పుడు వెలువడిన ఫలితాల ప్రభావం తో వైసిపి మరింతగా జనాల్లో ఆదరణ పెంచుకునేందుకు అవకాశం ఏర్పడింది.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
తప్పుడు ప్రచారం చేస్తున్న నాగబాబుకు ఈసీ షాక్.. మెట్టుతో కొట్టినట్టు బుద్ధి చెప్పిందిగా!

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నారనే వార్తలు నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు బాగా కలిసి వచ్చేవే.

Advertisement

తాజా వార్తలు