ఉప ఎన్నికలు ఉన్నట్టా లేనట్టా ? సమీక్ష నిర్వహించిన ఈసీ !

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉందా లేదా అనే విషయంలో ఎవరికీ ఒక క్లారిటీ దొరకడం లేదు.

ఒకవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

అయితే బిజెపి మాత్రం నవంబర్ వరకు ఎన్నికల తంతు జరగకుండా చూస్తే , అప్పుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని, ఆ విధంగా తమ పై తన పంతం నెరవేర్చుకోవాలని బిజెపి అభిప్రాయపడుతోంది.ఈ సమయంలో హుజురాబాద్ లో మాత్రం ఎన్నికలు తొందరగా నిర్వహిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఉంది.

ఎలా చూసుకున్నా ఈ ఉప ఎన్నికల విషయంలో బిజెపి ఎక్కువగానే టెన్షన్ పడుతోంది.     కాకపోతే మమత బెనర్జీ ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఏదోరకంగా ఒత్తిడి తీసుకువచ్చి,  ఉప ఎన్నికలు మరికొంత కాలం పొడిగించేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తోంది.

హుజురాబాద్ లో ఎప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయా అని టిఆర్ఎస్,  కాంగ్రెస్ తో పాటు, తెలంగాణ బిజెపి నేతలు ఎదురు చూపులు చూస్తున్నారు.ముఖ్యంగా ఈటెల రాజేందర్ పై ప్రజల్లో సానుభూతి ఉందని,  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయనకు ఫలితం అనుకూలంగా ఉంటుందని,  ఆలస్యమయ్యే కొద్దీ ఆయన ఆదరణ కోల్పోతారని బీజేపీ ఆందోళన చెందుతోంది.

Advertisement

అయితే ఈ విషయంలో తమ నిర్ణయం ఏంటి అనేది కేంద్ర ఎన్నికల సంఘం కూడా తేల్చకపోవడంతో ఈసీ నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.   

  ఇదిలా ఉంటే ఉప ఎన్నికలు నిర్వాహణ విషయమే ఇప్పటికే అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు దీని పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది.ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలా లేదా అనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చింది.అయితే ఆ నిర్ణయం ఏంటనేది బయటకు రాకుండా కేంద్ర ఎన్నికల సంఘం చాలా జాగ్రత్త పడుతోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉందనే విషయమై అధికారులతో నివేదికలు చెప్పించు కుంటోంది.ఎన్నికలను వాయిదా వేయాలంటూ కేంద్రం ఎన్నికల సంఘం పై  కేంద్రం ఒత్తిడి చేసినా,  కరోనా ను సాకుగా చూపించి  ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను మరికొంతకాలం వాయిదా వేస్తారు అని, విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికే అనేక చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.ఎక్కడైనా  ఆరు నెలల్లో ఎన్నికల తంతు ముగించాల్సి ఉంది.ఇప్పుడు ఆ గడువు కూడా పూర్తయ్యే పరిస్థితి నెలకొనడంతో  కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు