ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ ఆఫీసులలో బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం లేదని తెలియజేయడం జరిగింది.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్స్ అదే రీతిలో కొన్ని సంస్థలు తెరుచుకున్న నేపథ్యంలో.
ప్రభుత్వ ఆఫీసులో అదేరీతిలో ఉద్యోగస్తులు వస్తున్న క్రమంలో బుధవారం నుండి ప్రభుత్వ ఉద్యోగస్తులు.తప్పనిసరిగా పనిచేస్తున్న కార్యాలయాలలో బయోమెట్రిక్ వెయ్యాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్యయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు, సచివాలయాల్లో కచ్చితంగా ప్రతి ఉద్యోగి కూడా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆదేశాలు తక్షణమే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు, జిల్లా కలెక్టర్‌లకు సీఎస్ ఆదేశాలను ఇచ్చారు.ఈ పరిణామంతో ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా బయోమెట్రిక్ వేసి.
విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.అంతేకాకుండా ఏర్పాటు చేయాలని కూడా ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.