రేవంత్ ఉచ్చులో కేసీఆర్ పడ్డారా..?

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది.ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు నామినేషన్లు కూడా వేస్తున్నారు.

 Has Kcr Fallen Into Revanth's Trap , Revanth Reddy , Cm Kcr , Ysrtp , Brs ,t-TeluguStop.com

ఇక ప్రచారానికి కూడా కొన్ని రోజులే గడువు ఉండడంతో నాయకులంతా ప్రచారంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎక్కువగా పోటీ నెలకొంది.

బీజేపీ కాస్త వెనకబడిపోయింది అని చెప్పవచ్చు.అలాంటి తరుణంలో కేసీఆర్ ( KCR ) ముందుగానే అన్ని సీట్లు ప్రకటించి అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసి ప్రచారంలో మునిగిపోవాలని చెప్పారు.

Telugu Congress, Revanth Reddy, Telangana, Ts, Ysrtpp-Politics

ఇదే క్రమంలో కాంగ్రెస్ కూడా ఈసారి కేసీఆర్ ఎత్తులకు పైఎత్తులు వేసి ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది.మరి కేసీఆర్ పై కాంగ్రెస్ వేసిన ప్లాన్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.సీఎం కేసీఆర్ ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.కానీ దానికి వ్యతిరేకంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth reddy ) మరో ప్లాన్ గట్టిగా అమలు చేస్తున్నారు.

ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే అది బీఆర్ఎస్ కే లాభం అని కేసీఆర్ ముందుగానే అంచనా వేసుకున్నారు.

Telugu Congress, Revanth Reddy, Telangana, Ts, Ysrtpp-Politics

కానీ రేవంత్ రెడ్డి దాన్ని ముందుగానే గ్రహించారు.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏమాత్రం కూడా చీలిపోకుండా తన వైపే తిప్పుకుంటున్నారు.ముఖ్యంగా టిడిపి, టీజేఎస్, సిపిఐ, వైయస్ఆర్టీపీ ( YSRTP ) లాంటి పార్టీలను కూడా కలుపుకొని గ్రౌండ్ లెవెల్లో అన్ని విధాల కసరత్తులు చేస్తున్నారు.

అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపేలా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.అంతేకాకుండా చాలా నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అన్నింటిని ఏకం చేసి కాంగ్రెస్ ( Congress ) వైపుకే మళ్లేలా రేవంత్ రెడ్డి మంచి ప్లాన్ చేసి కేసీఆర్ కి కొరకరాని కొయ్యగా మారారు.అయితే కేసీఆర్ వేసినటువంటి ముందస్తు ప్లాన్ కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఎత్తుకు పైత్తులు వేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నింటిని కాంగ్రెస్ పార్టీ ఓట్లుగా మలుచుకొని ఈసారి విజయం దిశగా దూసుకుపోతుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube