వైయస్ షర్మిలకి ఊహించని షాక్ కీలక నేత రాజీనామా..!!

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని ఇటీవల స్థాపించి.తెలంగాణ రాజకీయాలలో వైయస్ షర్మిల చురుకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రతి మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కోసం దీక్ష చేపడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న వైఎస్ షర్మిల కి ఆదిలోనే సొంత పార్టీ నేతలు షాకులు ఇస్తున్నారు.విషయంలోకి వెళితే వైయస్సార్ తెలంగాణ పార్టీ మహిళా విభాగానికి చెందిన కీలక నాయకురాలు ఇందిరా శోభన్ రాజీనామా చేయడం జరిగింది.

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవికి రాజీనామా చేయడం జరిగింది.తన సన్నిహితుల సూచనల మేరకు వైఎస్సార్ టిపి పార్టీ నుండి వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు.ఇదే క్రమంలో త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఇందిరా శోభన్ తెలియజేశారు.

ఏదిఏమైనా ఆదిలోనే వైయస్సార్ తెలంగాణ పార్టీ నుండి కీలక నాయకులు బయటకు వెళ్లిపోవడం.షర్మిలకి గట్టి షాక్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు