అకీరాపై కాంగ్రెస్ సీనియర్ లీడర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకుంటున్న విషయం తెల్సిందే.

ఇటీవలే అకీరా కర్రను తిప్పుతూ విన్యాసాలు చేస్తున్న వీడియోను రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

నెట్టింట ఆ వీడియో తెగ వైరల్‌ అయ్యింది.పెద్ద ఎత్తున అకీరా సినిమాల్లోకి వస్తాడనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.

అయితే అకీరా సినిమాల్లోకి వచ్చే వయస్సు రాలేదు.మరో అయిదు ఆరు సంవత్సరాలు అంతకు మించి పట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి అకీరా నందన్ అందరి దృష్టిని ఆకర్షించాడు.ఆకీరా వీడియో పై తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్‌ ప్రముఖ వక్త అయిన దాసోజు శ్రవన్‌ కుమార్‌ స్పందించారు.2007 సంవత్సరంలో మూడు ఏళ్ల బాబుగా ఉన్న సమయంలో నిన్ను చూశాను.ఆ సమయంలో నువ్వు చాలా చిన్నగా క్యూట్‌ గా ఉన్నావు.

Advertisement

ఇప్పుడు నీ ఎదుగుదల చూసి ఆశ్చర్యంగా ఉంది.నీవ టీనేజ్ లో ఆకాశమే హద్దు అన్నట్లుగా అభిమానంను సంపాదించుకున్నావు.

మా తండ్రి లాగే నవ్వు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటూ ఆశించాడు.సినిమా పరిశ్రమలో విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ దాసోజు శ్రవన్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేశాడు.

రాజకీయాలకు అతీతంగా శ్రవణ్‌ కుమార్‌ అకీరా నందన్‌ ను అభినందించడం నిజంగా చాలా మంచి పరిణామం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.ప్రస్తుతం అకీరా మార్షల్‌ ఆర్ట్స్ తో పాటు పలు విభాగాల్లో శిక్షణ పొందుతున్నాడు.సినిమాల్లో ఎంట్రీకి కావాల్సినవి అన్ని కూడా నేర్చుకుంటూ స్టార్‌ గా నిలిచేందుకు ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

 స్వయంగా అకీరాకు ఇవన్నీ కూడా పవన్‌ దగ్గరుండి మరీ శిక్షణ ఇప్పిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.త్వరలోనే అకీరా విదేశాలకు వెళ్లబోతున్నాడట.అక్కడ సినిమాలపై మరింతగా నేర్చుకుంటాడని సమాచారం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు