బిగ్ బాస్ ఎంట్రీపై నోరు విప్పిన ఇషాచావ్లా.. ఏం చెప్పారంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రిటీల గురించి నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి.

బిగ్ బాస్ షో ప్రసారానికి ముందు చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపించినా ఆ జాబితాలోని పేర్లు తుది జాబితాలో ఉంటాయో లేదో కచ్చితంగా చెప్పలేము.

బిగ్ బాస్ షో సీజన్ 5 కంటెస్టెంట్ల జాబితాలో హీరోయిన్ ఇషాచావ్లా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ప్రేమకావాలి సినిమాతో ఇషాచావ్లా నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

ఆ తర్వాత ఇషాచావ్లా కొన్ని సినిమాల్లో నటించినా పూల రంగడు మినహా మిగిలిన సినిమాలు సక్సెస్ సాధించలేదు.సినిమా ఆఫర్లు తగ్గినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇషాచావ్లా తాజాగా వైట్ డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఇషాచావ్లా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆ ఫోటోను చూసిన నెటిజన్లు బిగ్ బాస్ షో గురించి స్పష్టత ఇవ్వాలని ఇషాచావ్లాను కోరారు.

Advertisement

నెటిజన్ల ప్రశ్నలకు నో అని సమాధానమిస్తూ బిగ్ బాస్ షోకు తాను వెళ్లడం లేదని ఇషాచావ్లా చెప్పకనే చెప్పేశారు.వాస్తవానికి బిగ్ బాస్ రూల్స్ ప్రకారం బిగ్ బాస్ షోకు కన్ఫామ్ అయినా షోలో పాల్గొనే వరకు ఆ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు.మరోవైపు కొందరు సెలబ్రిటీల పేర్లు ఎక్కువగా వినిపిస్తుండగా ఆయా సెలబ్రిటీలు బిగ్ బాస్ షోలో పాల్గొంటారో లేదో చూడాల్సి ఉంది.

వర్షిణి, యాంకర్ రవిలలో ఎవరో ఒకరు ఉంటారని జబర్దస్త్ కమెడియన్లలో ఒకరు ఉంటారని ప్రముఖ టీవీ ఛానల్ న్యూస్ యాంకర్ ఒకరు ఈ షోకు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.వచ్చే నెల నుంచి బిగ్ బాస్ షో ప్రసారం కానుంది.

Advertisement

తాజా వార్తలు