అమెరికాలో భారీగా పెరిగిన గన్ కల్చర్...ఇందుకు రీజన్ కూడా ఉందట..!!

అగ్ర రాజ్యం అమెరికాలో ఇప్పటికి ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే.

విపరీతంగా , ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతికి అడ్డు కట్ట ఎందుకు పడటం లేదు.

ఈ విషయంపై ఎన్నో ఏళ్ళుగా స్వచ్చంద సంస్థలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి.అమెరికా ప్రజలు తుపాకుల దెబ్బకు నెలకు రాలిన సంఘటనలు ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి.

ప్రతీ ఏటా తుపాకుల పేలుళ్ళ కారణంగా చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంటోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.అయినా ఇప్పటికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఇదిలాఉంటే మరొక ఆశ్చర్యక, ఆందోళన కలిగించే ఘటన ఏంటంటే.అమెరికాలో కరోన సమయంలో తుపాకుల కొనుగోళ్ళు విపరీతంగా పెరిగాయట.

Advertisement

గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో మార్కెట్ జరగలేదని చెప్తున్నారు వ్యాపారస్తులు.మరొక విషయం ఏంటంటే గడిచిన ఏడాదిలో దాదాపు 2 కోట్ల తుపాకులు అమ్ముడు పోయాయట, ఈ కొనుగోళ్లలో దాదాపు 40 శాతం మహిళలే చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే కరోనా సమయంలోనే ఈ స్థాయిలో తుపాకీ సంస్కృతీ పెరగానికి కారణం ఏంటంటే.అమెరికాలో ఈస్థాయిలో తుపాకులు కొనడానికి కారణాలు అనేకం ఉన్నాయట.

అందులో ప్రధానంగా చాలామంది ఆర్ధిక ఇబ్బందులు, పగ, ప్రతీ కారాలతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారట అందుకు కారణం అయిన వారిపై పగ తీర్చుకోవడానికి తుపాకులు కొనుగోలు చేస్తున్నారట.అలాగే యువతులు తమను తాము రక్షించుకోవడానికి తుపాకులు కొంటున్నారని తెలుస్తోంది.

ఇక మరొకొందరు కరోనా కారణంగా వచ్చే ఖాళీ సమయాన్ని వేటాడటం కోసం వినియోగిస్తున్నారట.కరోనా సమయంలో వేటాడే సంస్కృతీ కూడా బాగా పెరిగిందని అంటున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఈ కొనుగోళ్ళ కారణంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయట.ఇదిలాఉంటే

Advertisement

తుపాకులు కొనుగోళ్ళు చేయడానికి ముందు చాలామంది మహిళలు ప్రత్యేకంగా తర్ఫీదు తీసుకున్న తరువాత మాత్రమే తుపాకులు కొంటున్నారని ఫైర్ ఆర్మస్ ట్రైనర్స్ అసోసియేషన్ తెలిపింది.వారు చెప్పిన వివరాల ప్రకారం తుపాకులు కొనుగులు చేసిన చాలామంది వారి వద్ద వివరాలు నమోదు చేయలేదని ఎంతో గోప్యత పాటించారని అసోసియేషన్ వెల్లడించింది.ఏది ఏమైనా సహజంగానే తుపాకీ సంస్కృతీ ఎక్కువగా ఉండే అమెరికాలో భారీ స్థాయిలో కొనుగోళ్ళు జరగడం అనేది ఆందోళన కలిగించే అంశమే.

తాజా వార్తలు