న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష

  టిజేఎస్ అధినేత, ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష  గురువారం ప్రారంభం అయ్యింది.

పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఆయన ఈ దీక్ష చేపట్టారు. 

2.మంత్రిపై హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ కుటుంబం నుంచి తమకు ప్రాణ హాని ఉందంటూ మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన దంపతులు విశ్వనాథ్ రావు , పుస్పలత అనే దంపతులు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. 

3.ఈటెల కు వ్యతిరేకంగా నినాదాలు

  హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి , బీజేపీ నేత ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చోటు చేసుకున్నాయి.దళితులను కించపరిచే విధంగా రాజేందర్ మాట్లాడారు అంటూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ బావమరిది మధుసూధన్ రెడ్డి దిష్టిబొమ్మకు శవ యాత్ర నిర్వహించారు. 

4.ఆన్లైన్ పెయింటింగ్ పోటీలు

  వరల్డ్ టైగర్స్ డే ను పురస్కరించుకుని విశాఖ జూ ఆధ్వర్యంలో విద్యార్థులకు పులులు వాటి నివాస స్థలం అనే అంశం పై ఒకటో తరగతి నుంచి కళాశాల విద్యార్థులకు గురువారం ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్టు జూ క్యురేటర్ నందిని సలారియా తెలిపారు. 

5.భార్య బాధితుల సంఘం సమావేశం

  భార్య బాధితుల సంఘం సమావేశం ఆధ్వర్యంలో ఆగస్ట్ 1 న సమావేశం కాబోతున్నట్లు సంఘం అధ్యక్షుడు బాలాజీ రెడ్డి తెలిపారు. 

6.  కరీంనగర్ జిల్లాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటన

  మాజీ ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.గురువారం తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామాన్ని సందర్శిస్తారు. 

7.నేడు నల్గొండలో మంత్రి జగదీష్ పర్యటన

  నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి జగదశ్వరరెడ్డి పర్యటించనున్నారు. 

8.ఆగస్ట్ 3న ఈసెట్

Advertisement

  తెలంగాణలో ఈ సెట్ పరీక్షను ఆగస్ట్ 3 న నిర్వహించనున్నారు.   

9.టిఎన్జీవో కు అనుబంధం గా అర్చక జెఎసి

  టి ఎన్జీవో కు అనుబంధంగా తెలంగాణ అర్చక జేఏసి పనిచేస్తుంది అని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాజేందర్ ప్రకటించారు. 

10.విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ విషయంలో ఏపీ హై కోర్ట్ లో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం పై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.స్టీల్ ప్లాంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 

11.ఆహార వ్యవస్థలపై రీచ్ పరిశోధనా పత్రం

  తెలంగాణలోని కరువు ప్రాంతాల్లో ఆహార వ్యవస్థలపై రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ సర్కల్ ఆఫ్ హైదరాబాద్ ( రీచ్) ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది. 

12.దళిత బంధు నిలిపివేయాలి

  తెలంగాణలో హుజురాబాద్ ఎన్నికలు ముగిసేవరకు దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని భారత ఎన్నికల ప్రధానాధికారికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఫిర్యాదు చేశారు. 

13.ఇంటింటా ఆవిష్కరణల కోసం దరఖాస్తులు

  ఇంటింటా ఆవిష్కరణలో భాగంగా ఆసక్తి ఉన్నవారు కమ్మ ప్రయోగాలను పంపించాలని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కోరింది. 

14.తెలంగాణలో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

15.కాంట్రాక్ట్ వైద్యుల తొలగింపు

  వివిధ ప్రభుత్వ ఆసుత్రులలో 227 మంది కాంట్రాక్ట్ వైద్యులను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

16.భారత్ లో 45 కోట్ల టీకాలు 

  ఇప్పటి వరకు భారత్ లో 45 కోట్ల మందికి పైగా టీకాలు వేశామని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. 

17.దానం నాగేందర్ కు హై కోర్టు లో ఊరట

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

  ఓ దాడి కేసు వ్యవహారం కు సంబంధించి కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి దానం నాగేందర్ కు హైకోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించగా, ప్రజాప్రతినిధుల కోర్టు దానిని నిలిపివేసింది. 

18.తిరుమల సమాచారం

  తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.బుధవారం స్వామివారిని 17,752 మంది భక్తులు దర్శించుకున్నారు. 

19.భారత్ లో కరోనా 

Advertisement

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 43,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 44,900   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 48,990        .

తాజా వార్తలు