చనిపోయే లోపు ఒక్కసారైనా ఆ దేశానికి వెళ్లి రావాలంట...

థాయిలాండ్.ఈ దేశం పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బాడీ మసాజ్ లు మరియు అతి తక్కువ ధరలకే దొరికే మద్యం వంటివి.

అంతేకాక ఈ దేశాన్ని భూతల స్వర్గంగా ఇప్పటికే కొంతమంది చెబుతూ ఉంటారు.దీంతో ఎక్కువగా చాలా మంచిది పర్యాటకులు ఈ దేశానికి వెళుతూ ఉంటారు.

అయితే ఇప్పటి వరకు ఈ దేశం పేరు థాయిలాండ్ అని మాత్రమే చాలా మందికి తెలుసు.కానీ ఈ దేశం యొక్క అసలు పేరు సీయాం.

కానీ 1949 వ సంవత్సరంలో ఈ దేశం పేరును థాయిలాండ్ గా మార్చారు.అయితే ఈ దేశం రాజధాని బ్యాంకాక్.

Advertisement

ఈ పేరు వినగానే తెలుగులో రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ గుర్తొస్తాడు.ఎందుకంటే పూరి జగన్నాథ్ తన కథలను సిద్ధం చేసుకునేందుకు అప్పుడప్పుడు ఈ బ్యాంకాక్ నగరానికి వెళ్లి వస్తూ ఉంటాడు.

అంతేకాకుండా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ మరియు షూటింగ్ లొకేషన్స్ కోసం బ్యాంకాక్ కి వెళుతుంటాడు.అందువల్లనే బ్యాంకాక్ అంటే అందరికీ ముందుగా పూరీ జగన్నాథ్ గుర్తొస్తాడు.

అయితే వయసులో ఉన్న కుర్రాళ్ళు ఎక్కువగా ఈ దేశ రాజధాని అయిన బ్యాంకాక్ నగరాన్ని ఒక్కసారైనా చూడాలని అక్కడికి వెళ్లి ఒక్కరోజైనా హ్యాపీగా లైఫ్ గడపాలని కలలుకంటూ ఉంటారు.కానీ ఇది కొంతమందికే సాధ్యం అవుతుంది.

అయితే ఈ దేశం రక్తికి భక్తికి పెట్టింది పేరు.కాగా ఈ దేశంలో ఎక్కువగా బౌద్ధ మతస్తులు నివసిస్తున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

దీంతో వీరు బుద్ధుడిని పూజిస్తారు.ఈ దేశంలో బ్యాంకాక్ నగరంలో నైట్ లైఫ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

ఎందుకంటే ఈ దేశం పగటి లైఫ్ కంటే రాత్రి లైఫ్ చాలా బాగుంటుంది.అందుకే ఇక్కడ దాదాపుగా రాత్రి పూట ప్రజలు నిద్రపోరు.

అలాగే బాడీ మసాజ్ మరియు వ్యభిచారం కోసం చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.ఇక ఈ దేశంలో భక్తి విషయాల గురించి పరిశీలించినట్లయితే ఎక్కువగా ఇక్కడి ప్రజలు బ్రహ్మ దేవుడిని పూజిస్తారు.

ఆ తర్వాత ఎక్కువగా రాముడు, కృష్ణుడిని కూడా పూజిస్తారు.

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో దాదాపుగా 35 వేల హిందూ దేవాలయాలు ఉన్నాయి.అంతేకాకుండా ఈ దేశ రాష్ట్ర మరియు జాతీయ గ్రంథంగా రామాయణాన్ని ప్రకటించారు.దీంతో ఈ దేశ ప్రజలు కూడా రామాయణాన్ని చదువుతారు, పాటిస్తారు.

కాగా ఈ దేశపు కరెన్సీ థాయ్ భట్.కాగా ప్రస్తుతం థాయిలాండ్ దేశపు కరెన్సీ ఇండియన్ రూపాయి కంటే రూ.2.25 ఎక్కువగా ఉంది.దీన్ని బట్టి చూస్తే అతి తక్కువ బడ్జెట్ లో మీరు థాయిలాండ్ దేశం వెళ్లి రావచ్చు.

తాజా వార్తలు