వామ్మో: ఈ రకం కేజీ కలప.. కేజీ బంగారంతో సమానమట..!

ఇప్పటి వరకూ మనం ఖరీదైన కలప ఏదైనా ఉందంటే వెంటనే ఎర్రచందనం అనే అనుకుంటాం.గంధపు చెక్కకు ప్రపంచ వ్యాప్తంగా అంత పాపులారిటీ ఉంది.

దానికి మించిన విలువైన కలప ఈ ప్రపంచంలోనే చాలా ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలీదు.మనకు తెలియని కొన్ని రకాల కలపలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి.

వాటి ముందు గంధపు చెక్క విలువ చాలా తక్కువ మరి.గంధపు చెక్క ధర కంటే వీటి కలప ధర ఎక్కువగా పలుకుతుంది.ఈ కలప ధర బంగారం ధరతో సరిసమానంగా ఉందని మనం తెలుసుకోవాలి.

గంధపు చెక్క ధర కిలోకు ఐదు నుండి ఆరు వేల రూపాయలు వరకు పలుకుతుంది.అయితే మనం చెప్పుకునే కలపను అతిపెద్ద ధనవంతులు కూడా కొనడానికి 10 సార్లు ఆలోచిస్తారు.

Advertisement

గంధపు చెక్క కంటే అతి విలువైన ఆ కలప పేరు ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్ అని చెప్పొచ్చు.ఈ కలప భూమి మీద అత్యంత విలువైనది భావిస్తారు.

ఈ కలప ధరతో మంచి లగ్జరీ కారును సులభంగా కొనేయవచ్చు.ఈ కలప ధర సరిగ్గా కిలో బంగారంతో సమానంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

అప్పుడు ఒక కిలో ధర 8 వేల పౌండ్ల కంటే ఎక్కువగా అంటే 7 లక్షల రూపాయలు అని తెలుస్తోంది. ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ చెట్లు ఆఫ్రికాలోని పొడి ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి.

సెనెగల్ తూర్పు నుండి ఎరిట్రియా దక్షిణాఫ్రికాలోని ఈశాన్య భాగాలలో ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.అయితే ఈ చెట్ల ఎత్తు 25 నుంచి 40 అడుగుల వరకూ ఉంటుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఈ చెట్లు మనం చూస్తే ఎక్కువగా పొడి ప్రాంతాలలో మాత్రమే మనకు కనిపిస్తాయి.

Advertisement

ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌ చెట్లు 60 సంవత్సరాల వరకూ మన చేతికి వస్తాయి.అయితే ఇటువంటి చెట్లు రోజు రోజుకు అంతరించి పోవడంతో ఇప్పుడందరూ అలర్ట్ అవుతున్నారు.దోపిడీదారులు ఈ కలపను దేశ సరిహద్దులు దాటిస్తూ ధనం మూటగట్టుకుంటున్నారు.

కెన్యా, టాంజానియా వంటి దేశాలలో ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ కలప అక్రమంగా రవాణా అవుతున్నట్లు ప్రభుత్వాలు నిఘా పెట్టాయి.

తాజా వార్తలు