మామూలుగా ఒక పది ఫ్లోర్స్ బిల్డింగ్ నిర్మించడానికి ఎంత సమయం, ఎన్ని ఏళ్లు అవుతుంది? ఆ భవనాన్ని కట్టించే కాంట్రాక్టర్, కూలీలు, మేస్త్రీలు ఇలా అందరూ ఫాస్టుగా పనులు చేస్తే మూడు సంవత్సరాలు అవుతుంది.ఒకవేళ ఆ భవనం కట్టడం చాలా నిదానంగా జరుగుతుంటే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అయినా అవుతుంది.
తమ ముందు నగదు, బిల్డింగ్ కట్టడానికి అన్నీ ఉన్నప్పుడు భవనాన్ని పూర్తి చేయడానికి కనీసం ఒక సంవత్సరం అయినా అవుతుంది.కానీ ఇక్కడొక ఆశ్చర్యకర సంఘటన జరిగింది.
ఓ 10 అంతస్తుల భవనాన్ని 28 గంటల్లోనే ఫినిష్ చేశారు.చైనాలో ఈ భవనాన్ని నిర్మించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.
చైనాలోని కట్టడానికి అత్యంత ఫాస్టుగా కట్టినవే కావడం విశేషం.చైనాలోని నిర్మాణాలు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప నిర్మాణాలను కలిగి ఉంటాయి.ఆ ఘనత చైనాకే సొంతం.చైనాలో ఈ మధ్య కేవలం 10 రోజులలోనే 1000 బెడ్ల హాస్పిటల్ ను కట్టారు.
ఆ రోజుల్లోనే చైనా సంచలనం కలిగించింది.ఇప్పుడు మరోసారి చైనా ఇంకో చారిత్రాత్మక కట్టడాన్ని నిర్మించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
చైనాలోని బ్రాడ్ గ్రూప్ కంపెనీ ఓ గొప్ప రికార్డును నెలకొల్పింది.కేవలం 10 ఫ్లోర్ల బిల్డింగును కట్టి బ్రాడ్ కంపెనీ ఫ్యాబ్రికేటెడ్ కన్ స్ట్రక్షన్ ను వేగంగా నిర్మించి 28 గంటల్లో 10 అంతస్తుల భవనాన్ని కట్టి చూపించారు.

చైనా కట్టిన ఈ 10 బిల్డింగుల భవణం కట్టడానికి ఓ పెద్ద కంటైనర్ బాక్సును తెచ్చి దాని సాయంతో నిర్మించారు.ఆ బాక్సులను ఒకదానిపై మరోకటి పెట్టి భవనాన్ని తొందరగా కట్టేశారు.బాక్సులను పేర్చిన తర్వాత బొల్టును బిగించారు.ఆ తర్వాత వాటిలో వాటర్, కరెంటు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.ఇది మొత్తం పూర్తి కావడానికి కేవలం 28 గంటల 45 నిమిషాలే పూర్తయ్యింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.