తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా కమర్షియల్.. ఇక్కడ అలాంటి సినిమాలు ఆడవు....

తెలుగులో ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన "లాహిరి లాహిరిలో" చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన హీరో "ఆదిత్య ఓం" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే వచ్చీరావడంతోనే ఆదిత్య ఓం హిట్ అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు.

ఈ క్రమంలో హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా దాదాపుగా నాలుగు సంవత్సరాలు పాటూ సినిమా పరిశ్రమలో బాగానే రాణించాడు.కానీ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై దృష్టి సారించడంతో తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు.

కాగా తాజాగా ఆదిత్య ఓం ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఇందులో భాగంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిన్న చిత్రాలకి పెద్దగా విలువ ఉండదని అందువల్లనే తాను బాలీవుడ్ లో తక్కువ బడ్జెట్ చిత్రాలలో హీరోగా నటించడానికి ఆసక్తి చూపినట్లు తెలిపాడు.

అంతేకాకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎప్పుడూ కూడా పక్కా కమర్షియల్ గా ఉంటుందని ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలకు చాలా వాల్యూ ఉంటుందని చెప్పుకొచ్చాడు.అయితే తాను బాలీవుడ్ లో చిన్న చిన్న కాన్సెప్ట్ ని తీసుకొని సినిమాలను తెరకెక్కించానని అలాంటి చిత్రాలు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పెద్దగా వర్కౌట్ కావని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Advertisement

ఒక రకంగా చెప్పాలంటే ఈ కారణం వల్లే తాను టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు.అయితే తాను సినిమాలో హీరోగా నటించడానికంటే ముందుగా పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని అందువల్లనే తనకు దర్శకత్వంపై ఆసక్తి కలగడంతో దర్శకుడిగా మారి సినిమాలను తెరకెక్కించానని తెలిపాడు.అయితే ఆదిత్య ఓం తెలుగులో ఒకప్పుడు ధనలక్ష్మి ఐ లవ్ యు, లాహిరి లాహిరిలో, నిశ్శబ్దం, పొదరిల్లు, మా అన్నయ్య బంగారం, పున్నమినాగు, తదితర చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

అయితే హిందిలో కూడా షుద్ర, ఫ్రెండ్ రిక్వెస్ట్, హూ కిల్డ్ రాజీవ్, బందూక్, ది డెడ్ ఎండ్ (ఇంగ్లీష్) తదితర చిత్రాల్లో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు.

Advertisement

తాజా వార్తలు