వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరోగా ట్రై చేస్తున్న జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజియస్ట్ యాక్టర్ గా ఉన్నాడని చెప్పాలి.

హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న తర్వాత అన్ని బాషలలో సినిమాలు చేస్తూ, విలన్ గా, హీరో తండ్రిగా అలాగే ఇతర ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం హిందీలోకి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఓ విధంగా హీరోల స్థాయిలోనే జగపతి బాబు క్రేజ్ కూడా ఉంది.

ప్రస్తుతం జగపతి బాబు చేతిలో ఏకంగా పది సినిమాలు ఉన్నాయి.వీటిలో కొన్ని రిలీజ్ కి రెడీ కాగా, కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇదిలా అప్పుడప్పుడు హీరోయిజం ఎలివేట్ అయ్యే పాత్రలని కూడా అతను చేస్తున్నాడు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న సమయంలోనే పటేల్ సర్ అనే సినిమా హీరోగా చేశాడు.

Advertisement

ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా డిజాస్టర్ అయ్యింది.

అయితే మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తుంది రచయిత నుంచి దర్శకుడుగా మారిన వక్కంతం వంశీ రీసెంట్ గా జగపతి బాబు డిఫరెంట్ స్టొరీ లైన్ ఒకటి వినిపించడం జరిగిందని తెలుస్తుంది.ఏజ్ క్యారెక్టర్ తోనే ఈ మూవీ ఉండబోతుందని, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇంటరెస్టింగ్ గా ఉండటంతో జగపతిబాబు నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.దీనికి సంబంధించి లాక్ డౌన్ తర్వాత పూర్తి స్థాయి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని టాక్.

వక్కంతం వంశీకి ఇద్దరు హీరోలు అవకాశం ఇచ్చిన వాళ్ళతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది.ఈ లోపు జగపతిబాబుతో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసి తనని తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు