వాళ్ళు త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండి అంటున్న ఏపీ వైద్య శాఖ మంత్రి..!!

ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఇటీవల మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది.

ఈ సందర్భంగా త్వరలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉండటంతో .

దాని ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లలపై పడే ప్రమాదముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో 5 సంవత్సరాల పిల్లలు కలిగిన తల్లులు టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు.పిల్లలకు కరోనా సోకితే వారి వెంట తల్లులూ ఉండాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళు తొలుత టీకాలు వేయించుకోవాలని సూచించారు.

కరోనా థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఈ క్రమంలో .వైరస్ బారిన పడే పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ అందుబాటులో ఇప్పటి నుండే ఉండేలా అధికారులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అంతమాత్రమే కాకుండా జిల్లా కేంద్రాలలో ‘హెల్త్ హబ్స్’ అందుబాటులోకి తీసుకురావాలని .కరోనా థర్డ్ వేవ్ వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేలా అందరూ రెడీగా ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. .

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు