జూన్ 10న 72 సంవత్సరాలకు వచ్చే అరుదైన సూర్యగ్రహణం..!

ఈ ఏడాదిలోనే తొలి సూర్యగ్రహణం జూన్ 10 గురువారం నాడు ఏర్పడబోతోంది.మొత్తం ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉంటాయి.

సూర్యగ్రహణం గురించి చాలా మందికి మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.గ్రహణం అనేది ఓ ఖగోళ సంఘటన.

చంద్రుడు, భూమికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు భూమి నుంచి చూసేవారికి సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా చంద్రుడిని కప్పి ఉంటాడు.దీన్నే చంద్రగ్రహణం అంటారుడు.

సూర్యుడు, చంద్రుడు మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రుడు వెనక భాగంలో ఉన్న సూర్యుడు కొంత కాలం పాటు కనిపించడు.ఈ దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అని అంటారు.

Advertisement

సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించపోవడాన్ని సూర్యగ్రహణం అని, చంద్రుడు కనిపించకపోతే చంద్రగ్రహణం అని పిలుస్తారు.అయితే ఈసారి కనిపించేది 72 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది.

ఈ సూర్యగ్రహణం భారత్ మినహా పలు విదేశాల్లో కనిపించనుంది.జూన్ 10, 2021 కృష్ణ పక్ష అమావాస్య ఆస్ట్రేలియా, బెలారస్, బెల్జియం, కెనడా, చైనా, ఘనా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్లాండ్, హంగరీ, ఐస్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, కజికిస్తాన్, మంగోలియా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, రష్యా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది.

జూన్ 10వ తేదీన సంభవించనున్న ఈ సూర్య గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదని చెబుతున్నారు.అంటే, ఈ సూర్యగ్రహణం దోష ఫలితాలు దేశంపై ప్రభావం చూపబోవట.

ఆ కారణంగానే దేశంలోని అన్ని దేవాలయాలు తెరుచుకునే ఉంటాయి.ఇళ్ళు, దేవాలయాలలో పూజలు యాధావిధిగా నిర్వహించబడుతాయి.ఈ సూర్యగ్రహణం వల్ల మన దేశంలో ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవని పండితులు చెబుతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ సూర్యగ్రహణంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు.అయితే, గర్బిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

భారత్ లో ఈ గ్రహణం సూచనలు పాటిస్తే చాలా వరకూ మేలు జరిగే అవకాశం ఉంది.

తాజా వార్తలు