వెరైటీగా ప్రపోజ్ చేసిన రవి.. సీక్రెట్ చెప్పేసిన నిత్యా సక్సేనా..?

బుల్లితెర స్టార్ యాంకర్లలో ఒకరైన రవి పెళ్లి జరిగిన తరువాత కొన్నేళ్ల పాటు పెళ్లి గురించి దాచిపెట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఒక సందర్భంలో లాస్య రవికి పెళ్లైందని రివీల్ చేయడం ఆ తర్వాత రవి, అతని భార్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం తెలిసిందే.

రవి భార్య పేరు నిత్యా సక్సేనా కాగా నిత్య గురించి రవి అభిమానులకు ఎక్కువగా తెలియదు.అయితే తాజాగా వియా రవి నిత్యా సక్సేనాలను ఇంటర్వ్యూ చేయగా నిత్యా సక్సేనా ఆ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రవి యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.రవి కూతురు వియా కూడా యూట్యూబ్ ద్వారా అభిమానులను సంపాదించుకుంటూ ఉండటం గమనార్హం.

వియా రవి ఎలా ప్రపోజ్ చేశాడని ప్రశ్నించగా నిత్యా సక్సేనా చెప్పుకొచ్చారు.తనకు రవి ఒక పెద్ద తొట్టిని బహుమతిగా ఇచ్చాడని మట్టి ఉన్న ఆ తొట్టిలో ప్రతిరోజూ నీళ్లు పోయమని రవి చెప్పాడని నిత్య చెప్పారు.

Advertisement

రవి చెప్పిన విధంగానే ఆ తొట్టిలో తాను నీళ్లు పోశానని అలా చేసిన వారం రోజుల తర్వాత తొట్టిలో మొక్కలు ఐలవ్యూ అనే అక్షరాలుగా మొలిచాయని నిత్య తెలిపారు.రవి ప్రపోజ్ చేసిన విధానం గురించి తెలిసి అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.రవి భలే వెరైటీగా ప్రపోజ్ చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు రవి స్టార్ మా, జీ తెలుగు ఛానల్ లోని ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉండటం గమనార్హం.స్టార్ మా ఛానల్ లో రవి కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ చేస్తుండగా జీ తెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షో చేస్తున్నారు.

ఈ రెండు షోలు రవికి మంచి పేరు తెచ్చిపెడుతూ ఉండటం గమనార్హం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు