ఏపీ ప్రభుత్వం తనను ఎంతగా వెంటాడి , వేధించినా, తన ఎత్తుగడల ముందు మీరంతా చిత్తే అన్నట్లుగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహరిస్తున్నారు.ఆయనను రాజద్రోహం కేసు లో ఏపీ ప్రభుత్వం అరెస్టు చేయించిన దగ్గర నుంచి , ఆయన బెయిల్ పై విడుదల అయ్యి, ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే వరకు ఎన్నో సంచలనాల చోటు చేసుకున్నాయి.
అదే పనిగా తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న రఘురామకృష్ణంరాజు కు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిఐడి ని రంగంలోకి దించి ఆయనపై కేసులు నమోదు చేయించింది.ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చి ఢిల్లీలోనే ఉంటున్న రామకృష్ణంరాజు తన పలుకుబడి సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆయన కాలి గాయం కారణంగా వీల్ చైర్ లోనే బయటికి వస్తున్న రఘురామ కేంద్ర బిజెపి పెద్దలు ఒక్కొక్కరి ని కలుస్తూ ప్రభుత్వం తనను అక్రమంగా ఏ విధంగా అరెస్టు చేశారు అనే విషయాలపైనా, అరెస్టు అయిన తర్వాత జరిగిన పరిణామాల పై కేంద్ర బిజెపి పెద్దలతో చర్చిస్తూ, రాజకీయ ప్రకంపనలు సృష్టించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు.
తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తనపై పోలీసులు చేసిన దాడి, అరెస్టుల వ్యవహారం పై ఏపీ ప్రభుత్వం తనను మళ్లీ అరెస్టు చేయించేందుకు ప్రయత్నించడం, మిలటరీ ఆస్పత్రిలో ఈమేరకు కుట్ర పన్నడం వంటి వ్యవహారాలు అన్నిటిని రఘురామకృష్ణంరాజు వివరించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ సైతం ఆసక్తిగా రఘురామకృష్ణంరాజు నుంచి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇద్దరు మిలట్రీ అధికారుల పై రఘురామకృష్ణంరాజు చర్యలు తీసుకోవాలని రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశారట.
ముఖ్యంగా టీటీడీ అదనపు ఈవోగా పనిచేస్తున్న మిలిటరీ ఆసుపత్రి ఆడిట్ అకౌంట్స్ ఉద్యోగి ధర్మారెడ్డి, మిలటరీ ఆస్పత్రి రిజిస్టార్ కేపీ రెడ్డితోపాటు గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి తదితరులు తనను మళ్లీ అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారు అంటూ రాజ్ నాథ్ సింగ్ కు రఘురామకష్ణంరాజు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మిలటరీ ఆస్పత్రిలో చోటుచేసుకున్న పరిణామాలు అన్నిటిని రాజ్నాథ్ సింగ్ కి రఘురామకృష్ణంరాజు వివరించారు.తన ఆరోపణలకు బలం చేకూరాలి అంటే కేపీ రెడ్డి కాల్ రికార్డ్ లను తనిఖీ చేయాలని కోరారు.
కేవలం రాజ్ నాథ్ సింగ్ నే కాకుండా, మరికొంత మంది కేంద్ర మంత్రులను కలిసేందుకు రఘురామ కృష్ణంరాజు ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో ఏపీ ప్రభుత్వం సైతం ఆయన కదలికలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.