దీపికా పదుకునేని బందిపోటు నాయకురాలిని చేస్తున్న బన్సాలీ

బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో సంజయ్ లీలా బన్సాలీ మెయిన్ ఛాయస్ అంటే దీపికా పదుకునే పేరు వినిపిస్తుంది.

ఆమెతో ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కించే సూపర్ హిట్ కొట్టారు.

మూడు సినిమాలు కూడా ప్రేమకథలతోనే తెరకెక్కినవి కావడం, అలాగే పీరియాడిక్ టచ్ ఉన్నవి కావడం విశేషం.దీపికా పదుకునే స్టార్ హీరోయిన్ గా ఈ రేంజ్ లో ఉందంటే దానికి కారణం బన్సాలీ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన రామ్ లీలా మూవీనే.

అలాగే రణవీర్ సింగ్, దీపికా పదుకునే మధ్య ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్ళడానికి కారణం వీరిద్దరి కాంబినేషన్ లో బన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా, భాజీరావ్ మస్తానీ, పద్మావత్ మూవీలు అని చెప్పాలి.ఇదిలా ఉంటే మరోసారి దీపికా పదుకునే, బన్సాలీ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది.

అలియా భట్ తో గంగుబాయ్ ఖతియావాడి మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేసిన బన్సాలీ నెక్స్ట్ మూవీకి సంబందించిన ఏర్పాట్లు మొదలు పెట్టేశారు.బైజు బావ్రా టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కబోతుంది.

Advertisement

ఇందులో దీపికా పదుకునే బందిపోటు దొంగల రాణిగా నటించబోతున్నట్లు తెలుస్తుంది.మొఘలాయిల కాలం నాటి కథతో ఓ సంగీతకారుడికి, బందిపోటు దొంగల ముఠా నాయకురాలికి మధ్య జరిగే ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.

ఇందులో రివెంజ్ డ్రామా కూడా ఉంటుందని బోగట్టా.వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విజయ్‌భట్‌ దర్శకత్వంలో 1952లో రూపొందిన బైజు బావ్రాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు